Chennai, Oct 21: ప్రముఖ డైరెక్టర్ శంకర్ అల్లుడు, క్రికెటర్ రోహిత్ దామోదరన్‌పై లైంగిక వేధింపుల కేసు (Director Shankar's son-in-law booked under POCSO) నమోదైంది. అతనితోపాటు మరో ఐదుగురిని మంగళవారం పుదుచ్చెరిలో అరెస్ట్ చేశారు. 16 ఏళ్ల అమ్మాయిని (sexually harassing 16-year-old girl) లైంగికంగా వేధించారన్న ఆరోపణలు వీళ్లపై ఉన్నాయి. ఈ అందరిపైనా పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్‌లో శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్యను రోహిత్ దామోదరన్ పెళ్లి చేసుకున్నాడు. ఇతడు ఓ క్రికెట్ క్లబ్‌కు కెప్టెన్ కూడా.
రోహిత్, అతడి తండ్రి దామోదరన్, కోచ్ థమరాయ్ కన్నన్‌తో పాటు మరో ఇద్దరిపై పుదుచ్చెరిలోని మెట్టుపాళయమ్ పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లిన తనని లైంగికంగా వేధించారని సదరు బాధిత బాలిక ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రోహిత్‌తో పాటు అతడి తండ్రి, కోచ్ మరో ఇద్దరిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ విషయం ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని తనని బెదిరించిట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఇచ్చిన మరో ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించింది. అయితే వారిని అరెస్టు చేశారా? లేదా?, ఇంకా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఏడాది జూన్‌లో డైరెక్టర్ శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్యతో రోహిత్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.