T20 (Credits: Cricinfo)

Newdelhi, October 23: పరిమిత ఓవర్ల క్రికెట్లో (Cricket) అత్యంత బలమైన జట్టుగా ముద్రపడిన ఇంగ్లండ్ (England) టీ20 వరల్డ్ కప్ (T20 Worldcup) లో శుభారంభం చేసింది. సూపర్-12 (Super-12) దశలో భాగంగా... పెర్త్ లో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత శామ్ కరన్ (5 వికెట్లు) నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఆఫ్ఘన్ ను 19.4 ఓవర్లలో 112 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లండ్... ఆపై 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో లియామ్ లివింగ్ స్టన్ 29 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ జోస్ బట్లర్ 18, ఓపెనర్ అలెక్స్ హేల్స్ 19, డేవిడ్ మలాన్ 18 పరుగులు చేశారు. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కేవలం 2 పరుగులే చేసి నబీ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు.

చికెన్ వండాలన్న భర్త.. నిరాకరించిన భార్య.. ఇరువురి మధ్య ఘర్షణ.. దంపతుల వివాదంలో తలదూర్చి ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి.. మధ్యప్రదేశ్ లో దారుణం

అంతకుముందు, టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఎడమచేతి వాటం పేసర్ శామ్ కరన్ పిచ్ పరిస్థితులను ఉపయోగించుకుని ఆఫ్ఘన్ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశాడు. 3.4 ఓవర్లు బౌలింగ్ చేసిన కరన్ కేవలం 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయడం మ్యాచ్ లో హైలైట్ గా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 2, మార్క్ ఉడ్ 2, క్రిస్ వోక్స్ 1 వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ లో ఇబ్రహీం జాద్రాన్ 32, ఉస్మాన్ ఘనీ 30 పరుగులు చేశారు.