Virat Kohli World Record: 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎవరూ సాధించలేని రికార్డును సాధించిన విరాట్ కోహ్లీ, ఏడు సార్లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 2000 ప్లస్ రన్స్
Kohli (Photo Credits: Twitter)

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో విరాట్‌ కోహ్లి వరల్డ్‌ రికార్డు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్‌ రికార్డలకెక్కాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఏడు సార్లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 2000 ప్లస్ రన్స్ చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డును బద్దలు కొట్టాడు.

రోహిత్ శర్మ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా..

ఇక ఈ ఏడాది కోహ్లీ రెండు ఫార్మాట్లలో కలిపి 2048 పరుగులు చేశాడు. అంతకుముందు 2012 ఏడాదిలో(2186 పరుగులు), 2014(2286 పరుగులు), 2016(2595 పరుగులు), 2017(2818 పరుగులు), 2018(2735 పరుగులు), 2019(2455 పరుగులు) చేశాడు. తద్వారా 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఈ ఫీట్‌ నమోదు చేసిన ఏకైక ఆటగాడు విరాట్‌ కోహ్లి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లందరూ విఫలమైనప్పటికీ.. కోహ్లి మాత్రం 76 పరుగులతో అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు.అయితే ఈ టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది.