Glenn Maxwell (Photo Credit: Twitter/@mufaddal_vohra)

తన ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఐపీఎల్‌ ఆడతానంటూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ స్టార్‌ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. తనకెంతో ఇష్టమైన ఐపీఎల్‌ను 'ఇక నడవలేను' అనుకునే వరకు ఆడతానని తెలిపాడు. తన జీవితంలో ఐపీఎలే తన చివరి క్రికెట్‌ టోర్నీ అవుతుందని అన్నాడు. ఐపీఎల్‌లో తాను కలిసిన ఆటగాళ్లు, కోచ్‌ల నుంచి ఎంతో నేర్చుకున్నానని.. విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌, డుప్లెసిస్‌ లాంటి ఆటగాళ్లతో భుజాలు రాసుకుంటూ గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని భావోద్వేగానికి లోనయ్యాడు.

కాలి నొప్పితో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మైదానంలో ఎంత విలవిలలాడాడో ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది, సెల్యూట్ టూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌

ఐపీఎల్‌తో మ్యాక్స్‌వెల్‌కు పదేళ్లకు పైగా అనుబంధం ఉంది. 2012 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మొదలైన అతని ప్రస్తానం.ఆతర్వాత ముంబై, పంజాబ్‌ ఫ్రాంచైజీలతో విజయవంతంగా సాగింది. ఈ ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు కోహ్లి ప్రత్యేక చొరవతో 2021 సీజన్‌లో ఆర్సీబీతో జతకట్టాడు.

ప్రస్తుతం ఆర్సీబీ మ్యాక్సీకి 14.25 కోట్ల రెమ్యూనరేషన్‌ చెల్లిస్తుంది. గత సీజన్‌లో అతను 183.49 స్ట్రయిక్‌రేట్‌తో 400 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించాడు. మ్యాక్స్‌వెల్‌ ఇటీవలి భారత పర్యటనలోనూ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ పర్యటనలో అతను నెల వ్యవధిలో మూడు మెరుపు శతకాలతో (వరల్డ్‌కప్‌లో 2, టీ20 సిరీస్‌లో ఒకటి) విరుచుకుపడ్డాడు.