చెన్నై భారీ మొత్తం ఖర్చు పెట్టి సొంతం చేసుకున్న ఆటగాడు బెన్ స్టోక్స్ మళ్లీ నిరాశపరిచాడు. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ని దాదాపు రూ. 16.25 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టోక్స్ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో 8 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు.
అంతకుముందు గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా స్టోక్స్ దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో అతడు కనీసం ఒక సిక్సర్ కూడా కొట్టక పోవడం గమానార్హం. రెండు మ్యాచ్‌లు కలపి కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. కాగా గతేడాది ఆఖరిలో జరిగిన ఐపీఎల్-2023 మినీవేలంలో బెన్ స్టోక్స్‌ను రూ. 16.25 కోట్ల భారీ మొత్తం వెచ్చించి సీఎస్‌కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఇంత భారీ మొత్తం ధర దక్కించుకున్న స్టోక్స్ ఇలా నిరాశపరచడం సీఎస్‌కే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా స్టోక్స్‌ను దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ మాత్రం ఆటకు రూ. 16.25 కోట్ల దండగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది స్టోక్స్ టీ20లకు సెట్‌కాడని పోస్టులు చేస్తున్నారు. స్టోక్స్ ఆట తీరుపై ఓ యూజర్ స్పందిస్తూ.. ఇక ఆడింది చాలు , 16 కోట్లు వెనుక్కి ఇచ్చే అంటూ ట్వీట్ చేశాడు.