Happy Birthday Sehwag: మోస్ట్ డేంజరస్ బ్యాట్స్‌మెన్ వీరూకి పుట్టిన రోజు శుభాకాంక్షలు, మిస్టర్ ట్రిపుల్ అంటూ అర్ధరాత్రి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన బీసీసీఐ, నిజజీవితంలోనూ సెహ్వాగ్ మంచి మనసున్న మారాజే
Happy Birthday Sehwag: interesting Things about Former dashing Indian opener viru

October 20: క్రికెట్ అభిమానులు ఒకప్పుడు అమితంగా ఇష్టపడే భారత బ్యాట్స్‌మెన్‌లలో వీరేంద్ర సెహ్వాగ్ స్థానం ఎప్పడూ పదిలంగా ఉంటుంది. మైదానంలో ఉన్నంతసేపు ఈ డాషింగ్ ఓపెనర్ పరుగుల వరదను పారిస్తాడు. 1999లో క్రికెట్ అరంగ్రేటం చేసిన ఈ ఢిల్లీ క్రికెటర్.. 2001 వరకు తనను తానూ నిరూపించుకోలేకపోయాడు. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు కీలక భాగస్వామ్యం అందించంతో అతనిలోని కసి బయటకు తెలిసింది. అప్పటి నుంచి జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయారు.

ఆ తరువాత సచిన్ టెండూల్కర్ స్థానంలో ఓపెనర్ గా అడుగుపెట్టి.. గ్రౌండ్ లో పరుగుల వరదను పారించి ఇండియాకు ఎన్నో విజయాలను అందించాడు. టెస్ట్ క్రికెట్ లో త్రిబుల్ సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా , అటు వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా సెహ్వాగ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

డబుల్ సెంచరీ ట్వీట్ 

మొత్తం వన్డేల్లో 251 మ్యాచ్ లు ఆడిన సెహ్వాగ్ 8273 పరుగులు చేశారు. టెస్ట్ విషయానికి వస్తే 103 టెస్టుల్లో 49.34 సగటున 8586 పరుగులు చేశారు. సెహ్వాగ్ బ్యాట్‌తోనే కాకుండా బాల్‌తోనూ మెరుపులు మెరిపించాడు. వన్డేల్లో 96 వికెట్లు, టెస్ట్ మ్యాచ్‌లలో 40 వికెట్లు తీసుకున్నారు.

2011 వరల్డ్ కప్ గెలిచిన వేళ..

2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచిన సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. నేడు అందరూ ముద్దుగా వీరూ అని పిలుచుకునే సెహ్వాగ్ పుట్టిన రోజు..

2008లో చెపాక్ లో వీరూ చేసిన పోరాటం ఎవ్వరూ మరువ లేరు. దక్షిణాఫ్రికా భీకర బౌలింగ్ ను అవలీలగా ఎదుర్కుంటూ సెహ్వాగ్ చేసిన ట్రిపుల్ సెంచురీ అతనిలోని బ్యాటింగ్ రుచిని ప్రపంచానికి చూపించింది. బంతిపై కనికరమనేదే లేకుండా ఆడేది తొలి బంతా లేక చివరి బంతా అన్న తేడా లేకుండా సాగిన ఆ వీర విహారంలో 42 బౌండరీలు, 5 సిక్సర్లు ఉన్నాయంటే వీరు బ్యాటింగ్ ఎంత భయకరంగా సాగిందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలోనే దానిని గుర్తు చేసుకుంటూ.. 300 పరుగులు చేసిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. 'మిస్టర్ ట్రిపుల్ సెంచరీయన్ కు పుట్టినరోజు శుభాకంక్షలు' అని పేర్కొంది. దీనిపై వీరూ స్పందిస్తూ... 'మీ టైమింగ్ అద్భుతం.. ఏమి టైమింగ్.. సరిగ్గా అర్ధరాత్రి దాటగానే వీడియో అప్ లోడ్ చేశారు. బీసీసీఐకి ధన్యవాదాలు' అని రిప్లై ఇచ్చారు.

బీసీసీఐ ట్వీట్

సచిన్-సెహ్వాగ్ ఓపెనింగ్ కాంబినేషన్

సచిన్-సెహ్వాగ్ ఓపెనింగ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్డేల్లో వీరిద్దరి జోడీ 2002-2012 మధ్య కాలంలో 93 ఇన్నింగ్స్‌ల్లో 42.13 యావరేజితో 3919 పరుగులు చేసింది. ఇందులో 12 సెంచరీ భాగస్వామ్యాలు ఉండగా... 18 హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి.  బాల్ ను పగలకొట్టడమే కాదు జోకుల్ని కూడా పగలకొడతావంటూ సచిన్ ట్వీట్ చేశారు.

లెజెండ్ సచిన్ ట్వీట్ 

ఈ డాషింగ్ ఓపెనర్ నిజ జీవితంలో కూడా చాలా మంచి మనసును కలిగి ఉన్నాడు. ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వీరూ తన పోస్టులతో ఎప్పుడూ నెటిజన్ల మనసును దోచుకుంటూ ఉంటాడు.ఈ నేపథ్యంలో ఆయన ఈ మధ్య చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది.

సెహ్వాగ్ ట్వీట్ 

ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడిలో సుమారు నలభైకు పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అమర జవాన్లలో కొందరి పిల్లలకు సెహ్వాగ్‌ తన అంతర్జాతీయ స్కూల్‌లో ఉచితంగా చదువు చెప్పిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ పిల్లాడు క్రికెట్‌ శిక్షణ పొందుతున్న ఫోటోలను సెహ్వాగ్ తన ట్విట్టర్‍‌లో పోస్టు చేస్తూ "హీరోల కుమారులు. నా స్కూల్‌లో ఈ చిన్నారులకు సేవలు అందించడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నా. బ్యాట్స్‌మన్ - అర్పిత్ సింగ్ s/o అమర జవాన్ రామ్‌ వకీల్‌ కుమారుడు కాగా, బౌలర్‌ - రాహుల్‌ సోరెంగ్‌ s/o అమర జవాన్ విజయ్‌ సోరెంగ్‌ కుమారుడు). కొన్ని విషయాలు ఆనందాన్ని ఇస్తాయి" అని ట్వీట్ చేశాడు.

'స్పెషల్ ఫ్రెండ్ కి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. చిరునవ్వు, వినోదాలతో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను' అని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు.

వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్

'మోస్ట్ డేంజరస్ బ్యాట్స్ మెన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను ఆయనను ఎన్నడూ ఔట్ చేయలేదు. ఆయన ఆధునిక కాలంలో వీఐవీ రిచర్డ్స్ వంటి వాడు' అని హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు.

హర్భజన్ సింగ్ ట్వీట్

కాగా, వీరితో పాటు వీరూకి చాలా మంది క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.