Harbhajan Singh

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ కీలక ప్రకటన చేశాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ట్విటర్‌లో పేర్కొన్నాడు. తనకు అన్నీ ఇచ్చిన క్రికెట్‌ వీడ్కోలు పలుకుతున్నాను, 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తనకు సహకరిస్తూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తన సందేశాన్ని తెలిపాడు.

ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యాడు టర్బోనేటర్. " నా 23 ఏళ్ల కెరీర్ కు గుడ్ బై (Harbhajan Singh Retires) చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ లాంగ్ జర్నీలో నాకు సహాయపడిన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు" అంటూ ట్వీట్ చేశాడు. హర్భజన్​ సింగ్ చివరి సారిగా 2015లో ఇంటర్నేషనల్​ మ్యాచ్​లో అడాడు. ప్రస్తుతం భజ్జీ వయసు 41 సంవత్సరాలు.

హర్భజన్ సింగ్ (Harbhajan Singh) 23 ఏళ్ల క్రితం 1998లో ఆస్ట్రేలియాలో మార్చి 25న జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు . రెండు రంజీ ట్రోఫీల్లో 8 వికెట్లు తీసిన భజ్జీనిసెలక్టర్లు ఆసీస్ టూర్‌కి ఎంపిక చేశారు .టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో జట్టులోకి వచ్చిన హర్భజన్ సింగ్, సచిన్ టెండూల్కర్ , సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోనూ ఆడాడు.

Here's Harbhajan Turbanator Tweet

103 టెస్టుల్లో 417 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా ఉన్న హర్భజన్ సింగ్, టెస్టుల్లో రెండు సెంచరీలు, 9 హాఫ్ హాఫ్ సెంచరీలతో 2224 పరుగులు కూడా చేశాడు.236 వన్డే మ్యాచులు ఆడిన హర్భజన్ సింగ్, 269 వికెట్లు తీశాడు. 28 టీ20 మ్యాచుల్లో 25 వికెట్లు తీసి... ఓవరాల్‌గా 711 అంతర్జాతీయ వికెట్లు తీశాడు.ఐపీఎల్ 163 మ్యాచుల్లో 150 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ టీమ్‌లలో సభ్యుడిగా ఉన్నాడు.

2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసిన హర్భజన్ సింగ్, భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బౌలర్‌గా నిలిచాడు.2001, మార్చి 11న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్‌లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించిన భజ్జీ, అదే మ్యాచ్‌లో మాథ్యూ హేడెన్, మార్క్ వాగ్, స్టీవ్ వా, జాసన్ గిలెస్పీ వికెట్లు తీశాడు.

ఏడవ స్థానానికి దిగజారిన విరాట్ కోహ్లీ, టాప్‌లో ఆసీస్‌ ఆటగాడు లబూషేన్‌, రెండవ స్థానంలో ఇంగ్లండ్‌ సారధి జో రూట్‌, ఐసీసీ తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ బ్యాటర్ల హవా

పంజాబ్​లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో హర్భజన్​ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు (Harbhajan Singh to Join Politics) వార్తలొస్తున్నాయి. ఇటీవల అతడు పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూను కలిశాడు. దీనితో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడనే వార్తలకు మరింత బలం చేకూరింది.ఇంతకు ముందు కూడా హర్భజన్​ సింగ్ బీజేపీలో చేరుతాడనే వార్తలు వచ్చాయి. అయితే వాటిని భజ్జీ తిరస్కరించాడు.