australia-win-by-42-runs-against-ireland-in-t20-worldcup (Photo-Twitter)

భారత్‌ లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023 కోసం ఆస్ట్రేలియా తమ జట్టు వివరాలను ప్రకటించింది. వన్డే వరల్డ్‌కప్‌కు 18 మంది సభ్యులతో కూడిన ప్రిలిమనరీ(ప్రాథమిక) జట్టును ప్రకటించింది.ఈ జట్టుకు ప్యాట్‌ కమ్మిన్స్‌ సారధ్యం వహించనుండగా స్టార్‌ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌కు షాకిచ్చింది.ఇక యువ ఆల్‌రౌండర్‌ ఆరోన్ హార్డీ,స్పిన్నర్‌ తన్వీర్‌ సంగాకు తొలిసారి ఆసీస్‌ జట్టులో చోటు దక్కింది. ఇక ఇదే జట్టు ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికా, భారత పర్యటనలకు వెళ్లనున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది.

టీమిండియా క్రికెటర్‌గా ఉండటం చాలా కష్టం, సంచలన వ్యాఖ్యలు చేసిన కీపర్ సంజూ శాంసన్

వన్డే ప్రపంచకప్‌కు ముందు కంగారు జట్టు 8 వన్డేలు ఆడనుంది.దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్‌లో తలపడనున్న ఆస్ట్రేలియా.. అనంతరం టీమిండియాతో మూడు వన్డేలు ఆడనుంది. ఇక ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న టీమిండియాతో తలపడనుంది.

వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా , ఆడమ్ జంపా, ట్రావిస్ హెడ్.