Kagiso Rabada (Photo-ICC)

ఐసీసీ తాజాగా టెస్ట్ బౌలింగ్ ర్యాంకులను బుధవారం విడుదల చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్లతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ ప్రపంచ నంబర్ 1 బౌలర్‌గా అవతరించాడు. పూణే టెస్టులో న్యూజిలాండ్‌పై ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా నంబర్ వన్ ర్యాంకు నుంచి 3వ స్థానానికి దిగజారాడు.

రెండో టెస్టులోనూ టీమిండియా ఓటమి,113 పరుగుల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్, సిరీస్ కైవసం చేసుకున్న కివీస్ 

ఆసక్తికరంగా రెండో టెస్టులో 5 వికెట్లు తీసినప్పటికీ దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండు స్థానాలు కోల్పోయాడు. 2వ ర్యాంకు నుంచి 4వ స్థానానికి పడిపోయాడు. మరో భారత బౌలర్ రవీంద్ర జడేజా కూడా రెండు స్థానాలు కోల్పోయి ఎనిమిదో స్థానానికి దిగజారాడు. రెండవ టెస్టులో స్థాయికి తగిన ప్రదర్శన చేయకపోవడం భారత బౌలర్ల ర్యాంకింగ్స్ పడిపోవడానికి కారణమైంది. ఇక పాకిస్థాన్ బౌలర్ నోమన్ అలీ టాప్-10లోకి ప్రవేశించి 9వ స్థానంలో నిలిచాడు.

ఐసీసీ టాప్-10 బౌలర్లు వీళ్లే..

1. కగిసో రబాడ - 860 పాయింట్లు

2. జాష్ హేజిల్‌వుడ్ - 847 పాయింట్లు

3. జస్ప్రీత్ బుమ్రా - 846 పాయింట్లు

4. రవిచంద్రన్ అశ్విన్ - 831 పాయింట్లు

5. పాట్ కమ్మిన్స్ - 820 పాయింట్లు

6. నాథన్ లియాన్ - 801 పాయింట్లు

7. ప్రభాత్ జయసూర్య - 801 పాయింట్లు

8. రవీంద్ర జడేజా - 776 పాయింట్లు

9. నోమన్ అలీ - 759 పాయింట్లు

10. మాట్ హెన్రీ - 743 పాయింట్లు