Kevin O'Brien (Photo/X)

మరో 24 గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.తొలి మ్యాచ్‌లో ఢిఫెడింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచకప్ లో వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్లపై ఓ లుక్కేద్దాం.వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన రికార్డు ఐర్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్‌ ఓబ్రియన్‌ పేరిట ఉంది.

భారత్‌ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌లో ఓబ్రియన్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఈ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు.6వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఓబ్రియన్‌ బౌండరీల వర్షం కరిపించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న కెవిన్‌ 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌పై 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు.

పాక్ బౌలర్లను చీల్చి చెండాడిన ఆస్ట్రేలియా బ్యాటయర్ల, వరుసగా రెండు మ్యాచ్‌లో పాకిస్తాన్ పరాజయం

ఓబ్రియన్‌ తర్వాత ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఉన్నాడు. సొంతగడ్డపై జరిగిన 2015 వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే మాక్సీ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న మాక్సీ 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు.

మాక్స్‌వెల్‌ తర్వాత ఈ లిస్ట్‌లో దక్షిణాఫ్రికా లెజెండ్‌ ఏబీ డివిలియర్స్‌ ఉన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై కేవలం 52 బంతుల్లోనే డివిలియర్స్‌ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో 66 బంతులు ఆడిన ఏబీడీ.. 17 ఫోర్లు, 8 సిక్స్‌లతో 162 పరుగులు చేశాడు.

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ నాలుగో స్ధానంలో ఉన్నాడు. సొంత గడ్డపై జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లో మోర్గాన్‌ 57 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆఫ్గానిస్తాన్‌పై ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 71 బంతులు ఆడిన మోర్గాన్‌ 4 ఫోర్లు, 17 సిక్స్‌లతో 148 పరుగులు చేశాడు.

ఐదవ స్ధానంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం మాథ్యూ హేడన్‌ ఉన్నాడు. 2007 వన్డే ప్రపంచకప్‌లో హేడన్‌.. దక్షిణాఫ్రికాపై 66 బంతుల్లో శతకాన్ని సాధించాడు. మొత్తంగా 68 బంతులు ఎదుర్కొన్న హేడన్‌ 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు.