WTC Team of the Tournamentను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గత రెండేళ్లలో ( WTC 2021-2023) బాగా రాణించిన వివిధ దేశాల ఆటగాళ్లతో తమ బెస్ట్ ఎలెవన్‌ను రూపొందించింది. ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్ లకు చోటు దక్కింది. క్రికెట్ ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌కు పాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
టీం ఇండియా కొత్త జెర్సీ వీడియో ఇదిగో, వన్డే, టీ20లకు కొంచెం భిన్నంగా జెర్సీలను రూపొందించిన అడిడాస్
ఓపెనర్లుగా ఉన్మాన్ ఖవాజా (ఆసీస్), డిమిత్ కరుణరత్నె (శ్రీలంక)లను తీసుకుంది. బాబర్ అజామ్ (పాకిస్థాన్)కు మూడో స్థానంలో, జో రూట్ (ఇంగ్లాండ్)కు నాలుగో స్థానంలో అవకాశం కల్పించింది. ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా)ను ఐదో స్థానంలో తీసుకుంది. ఫాస్ట్ బౌలర్ల కోటాలో పాట్ కమిన్స్ (ఆసీస్), జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్), కగిసో రబాడ (సౌతాఫ్రికా)లను తీసుకుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు భారత్‌కు మరో షాక్, నెట్స్‌లో గాయపడిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్
స్పిన్, ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లను తీసుకోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడటానికి ముందు టెస్టుల్లో సంచలన బ్యాటింగ్‌తో అలరించిన రిషభ్ పంత్ (Rishabh Pant)ను వికెట్ కీపర్‌గా ఎంచుకుంది. కాగా బుధవారం (జూన్ 7) నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final) ప్రారంభంకానుంది. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా జరిగే ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో భారత్, ఆసీస్ తలపడనున్న విషయం తెలిసిందే.
క్రికెట్ ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్
ఉస్మాన్ ఖవాజా, డిమిత్ కరుణరత్నె, బాబర్ అజామ్, జో రూట్, ట్రావిస్ హెడ్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమిన్స్, జేమ్స్ అండర్సన్, కగిసో రబాడ.