ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 2022 డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఈ ఐపీఎల్ (IPL) సీజన్‌తో క్రికెట్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు.తాజాగా జియో సినిమాలో పంత్ తన మొదటి అనుభూతి గురించి అడిగినప్పుడు, "నేను జీవించి ఉన్నందుకు నేను సంతోషంగా ఉన్నాను.
కోలుకునేందుకు ఇన్ని రోజుల సమయం పట్టింది. తిరిగి ఫిట్ అయ్యేందుకు చాలా సమయం పట్టిందని, ఆ రోజులు నరక యాతన అనుభవించానని రిషబ్ పంత్ (Rishabh Pant) తెలిపాడు. అనారోగ్యంతో ఉన్న సమయంలో ఇబ్బందిగా ఫీలయ్యానని వివరించాడు. ఆ సమయంలో తాను బతికి ఉన్నందుకు మాత్రమే సంతోషించానని వైరాగ్యంతో సమాధానం ఇచ్చాడు.ఈ ఏడాది ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పంత్ నాయకత్వం వహిస్తాడు. ఐపీఎల్ తర్వాత టీ 20 వరల్డ్ కప్ సిరీస్ ఉంది. దానికి రిషబ్ పంత్ అందుబాటులో ఉంటారు. అభిమానుల గుండెల్ని ముక్కలు చేస్తూ ముగిసిన ధోనీ స్వర్ణయుగం, రెండోసారి చెన్నై పగ్గాలను వదిలేశాడు, కొత్త కెప్టెన్‌గా రుతరాజ్ గైక్వాడ్, జార్ఖండ్ డైనమైట్ ఐపీఎల్ రికార్డు ఇదిగో..
మార్చి 23న పంజాబ్ కింగ్స్‌తో టాస్ కోసం ఫీల్డ్‌కి వెళ్లడం గురించి మీరు ఎలా భావిస్తున్నారని అడిగినప్పుడు పంత్ తన గురువు మరియు చాలా సన్నిహిత సోదరుడు లాంటి వ్యక్తి MS ధోనిని గుర్తు చేసుకున్నాడు.ఉత్సాహం ఉంది. ప్రస్తుతం, చాలా మిశ్రమ భావాలు ఉన్నాయి. కాబట్టి, నేను ఎక్కువగా ఆలోచించి మానసికంగా ఒత్తిడి చేయదలచుకోలేదు.మీరు క్రికెట్‌పై దృష్టి పెడితే . ఒకసారి మహి భాయ్, 'కోర్ సబ్జెక్ట్‌పై దృష్టి పెట్టండి' అని చెప్పాడు.IPL 2022లో గత సంవత్సరం కూడా క్వాలిఫికేషన్‌ను కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్, ఈసారి పంత్ రాకతో జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తోంది.