రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా తన వన్డే కెరీర్‌లో అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు.ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన బుమ్రా 3 వికెట్లు పడగొట్టినప్పటికీ ధారాళంగా పరుగులు (81) సమర్పించుకుని, ఈ మ్యాచ్‌లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్‌గా ఇండియన్ బౌలర్ అయ్యాడు. 2017లో కటక్‌తో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా ఇలాగే 81 పరుగులు సమర్పించుకున్నాడు.
వవ్డేల్లో బుమ్రా చెత్త ప్రదర్శనల్లో ఇవి టాప్ 2లో ఉండగా.. 2017లో ఇంగ్లండ్‌పై సమర్పించుకున్న 79 పరుగులు, 2020లో ఆసీస్‌పై సమర్పించుకున్న 79 పరుగులు ఆ తర్వాతి చెత్త ప్రదర్శనలుగా రికార్డయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలి 5 ఓవర్లలో వికెట్లేమీ తీసుకోకుండా 51 పరుగులు ఇచ్చిన అతను.. ఆతర్వాతి 5 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తీసిన 3 వికెట్లలో మ్యాక్స్‌వెల్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన యార్కర్ డెలివరీ హైలైట్‌గా నిలిచింది.