బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. గాయం తీవ్రతను అంచనా వేసేందుకు అతడిని స్కానింగ్ కోసం పంపించారు.వైద్య పరీక్షల అనంతరమే హార్దిక్ పాండ్యా పరిస్థితిపై అంచనాకు వచ్చే అవకాశం ఉందంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటన విడుదల చేసింది.
బంగ్లా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో బౌలింగ్ చేసేందుకు వచ్చిన హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. పాండ్యా బౌలింగ్లో తొలి మూడు బంతుల్లో లిటన్ దాస్ వరుసగా 0, 4, 4 బాదగా.. స్ట్రెయిట్ డ్రైవ్(రెండో బౌండరీ)ని ఆపేందుకు పాండ్యా విఫలయత్నం చేశాడు. కుడికాలితో బంతిని అడ్డుకోవాలని చూసి పట్టుతప్పి తన ఎడమకాలిపై పడిపోయాడు. మడిమకు గాయం కావడంతో పాండ్యా మైదానం వీడాడు. దీంతో స్టార్ బ్యాటర్, రైటార్మ్ మీడియం పేసర్ విరాట్ కోహ్లి వచ్చి పాండ్యా ఓవర్ పూర్తి చేయగా.. పాండ్యాను స్కానింగ్ కోసం తీసుకువెళ్లారు.
విరాట్ కోహ్లి బౌలింగ్ వీడియో ఇదిగో, మూడు బంతులు వేసి రెండు పరుగులు ఇచ్చిన టీమిండియా స్టార్
ఇక... గాయపడ్డ హార్దిక్ పాండ్యా స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్‌కు వచ్చాడు. పాండ్యా తిరిగి బౌలింగ్ చేసే అవకాశం లేదు.మిగిలిన మూడు బంతులను విరాట్ కోహ్లీ కంప్లీట్ చేశాడు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా గనుక గాయం తీవ్రత ఎక్కువై జట్టుకు దూరమైతే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే!