బంగ్లాదేశ్ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన సీరిస్ కోల్పోయిన టీమిండియా మూడో వన్డేలో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. బొటనవేలు గాయంతో కెప్టెన్ రోహిత్ శర్మ చివరి వన్డేతో పాటు టెస్ట్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. దాంతో జట్టు బాధ్యతలను వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ తీసుకోనున్నాడు.
మూడో వన్డేకు 14 మంది బృందంతో కూడిన జట్టుని బీసీసీఐ ఎంపిక చేసింది. ఇక గాయంతో బాధపడుతున్న పేసర్ దీపక్ చాహర్, కుల్దీప్ సేన్‌లకు కూడా విశ్రాంతిని ఇచ్చింది. మూడో వన్డేతో పాటు టెస్ట్ సిరీస్‌కు కుల్దీప్ యాదవ్‌ను (Kuldeep Yadav returns) సెలక్ట్ చేసింది. న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికైనా కూడా ఈ స్పిన్నర్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు.
రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా రెండో ఓవర్‌లో రోహిత్ శర్మ బొటన వేలికి గాయం అయింది. దాంతో బీసీసీఐ వైద్య సిబ్బంది అతడిని పరీక్షించారు. ఢాకాలోని ఆస్పత్రిలో రోహిత్‌కు స్కానింగ్ చేశారు. స్పెషలిస్ట్‌ను కలిసేందుకు అతను ముంబైకి పయనమమ్యాడు. దాంతో, మూడో వన్డేకు దూరం కానున్నాడు. రోహిత్ అందుబాటులో ఉంటాడా లేడా అనేది త్వరలో చెబుతామని బీసీసీఐ తెలిపింది. కాగా మొదటి వన్డేలో ఆరంగ్రేటం చేసిన కుల్దీప్ సేన్‌కు స్ట్రెస్ ఇంజూరీ అయింది. తొడ కండరాల గాయంతో దీపక్ చాహర్ కూడా మూడో వన్డేకు దూరమయ్యాడు.
భారత జట్టు : కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, షాబాజ్ అహ్మద్, శార్థూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్.