Team India. (Photo Credits: Twitter)

Ahmedabad, March 17: మంగళవారం ఇక్కడ జరిగిన మూడో టి20లో ఇంగ్లండ్‌ 8 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ తన 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో (IND vs ENG 3rd T20I 2021) బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం రాకుండానే అతని సహచరులు విజయాన్ని కానుకగా అందించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లి (46 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించగా, మిగతా బ్యాట్స్‌మెన్‌ ప్రభావం చూపలేకపోయారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్‌ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బట్లర్‌ (52 బంతుల్లో 83 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించగా... బెయిర్‌స్టో (28 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు.

స్కోరు వివరాలు

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) ఆర్చర్‌ (బి) వుడ్‌ 15; రాహుల్‌ (బి) వుడ్‌ 0; ఇషాన్‌ కిషన్‌ (సి) బట్లర్‌ (బి) జోర్డాన్‌ 4; కోహ్లి (నాటౌట్‌) 77; పంత్‌ (రనౌట్‌) 25; అయ్యర్‌ (సి) మలాన్‌ (బి) వుడ్‌ 9; పాండ్యా (సి) ఆర్చర్‌ (బి) జోర్డాన్‌ 17; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1–7, 2–20, 3–24, 4–64, 5–86, 6–156. బౌలింగ్‌: రషీద్‌ 4–0–26–0; ఆర్చర్‌ 4–0–32–0; వుడ్‌ 4–0–31–3; జోర్డాన్‌ 4–1–35–2; స్టోక్స్‌ 2–0–12–0; స్యామ్‌ కరన్‌ 2–0–14–0.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) రోహిత్‌ (బి) చహల్‌ 9; బట్లర్‌ (నాటౌట్‌) 83; మలాన్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) సుందర్‌ 18; బెయిర్‌స్టో (నాటౌట్‌) 40; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 158.

వికెట్ల పతనం: 1–23, 2–81. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–27–0; శార్దుల్‌ 3.2–0–36–0; చహల్‌ 4–0–41–1; హార్దిక్‌ 3–0–22–0; సుందర్‌ 4–0–26–1.