India vs Pakistan T20 Asia Cup 2022 (Photo-Twitter)

ఆసియా కప్‌ 2022లో (Asia Cup 2022) గత ఆదివారం (ఆగస్ట్‌ 28) పాకిస్తాన్‌తో తలపడిన టీమిండియా ఉత్కంఠ పోరులో (India vs Pakistan T20 Asia Cup 2022) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్ ప్రకారం మరో రెండు సార్లు ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. వచ్చే ఆదివారం (సెప్టెంబర్‌ 4)న తొలి పోరు జరిగే అవకాశం ఉండగా సెప్టెంబర్‌ 11న (ఆదివారం) మరో పోరులో (India vs Pakistan) తలపడే అవకాశం ఉంది. అదీ అన్నీ అనుకున్నట్లుగా జరిగితేనే ఈ రెండు జట్లు తలపడే ఛాన్స్ ఉంది.

లెక్కల ప్రకారం.. షెడ్యూల్‌ ప్రకారం గ్రూప్‌-ఏలో ఉన్న భారత్‌, పాక్‌, హాంగ్‌కాంగ్‌ జట్లు ప్రత్యర్ధి జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెప్టెంబర్‌ 4న సూపర్‌ 4లో తలపడతాయి. గ్రూప్‌-ఏలో టీమిండియా పాక్ ను ఓడించడం ద్వారా టేబుల్‌ టాపర్‌ (ఏ-1) బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. గ్రూప్‌ తదుపరి మ్యాచ్‌ల్లో ఆగస్ట్‌ 31న టీమిండియా, హాంకాంగ్‌ జట్లు తలపడతాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 2న పాకిస్తాన్, హాంకాంగ్‌ జట్లు తలపడతాయి.

పై రెండు మ్యాచ్‌ల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. పసికూన హాంగ్‌కాంగ్‌ గెలిచే అవకాశం ఉండకపోవచ్చు. ఈ లెక్కన గ్రూప్‌-ఏలో తొలి స్థానంలో భారత్‌, రెండో స్థానంలో పాకిస్తాన్‌ జట్లు ఉంటాయి. ఆసియా కప్ షెడ్యూల్‌ ప్రకారం.. గ్రూప్‌-ఏలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెప్టెంబర్‌ 4న సూపర్‌ 4లో తలపడతాయి.

ప్రపంచ కప్ ముంగిట.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ బౌలర్‌ బుమ్రా వచ్చేస్తున్నాడు!

ఇక ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే.. భారత్‌-పాక్‌ జట్లు అప్పుడే కాకుండా మరోసారి కూడా తలపడే అవకాశం ఉంది. సూపర్-4కు చేరిన జట్లు తమ గ్రూప్‌లోని జట్టుతో పాటు ఇతర గ్రూప్‌లోని (గ్రూప్‌-బి) తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లతో (బి1, బి2) ఒక్కో మ్యాచ్ ఆడతాయి. ఈ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెప్టెంబర్‌ 11న (ఆదివారం) ఫైనల్లో తలపడతాయి. ఆయా జట్ల ప్రస్తుత ఫామ్‌ను బట్టి​చూస్తే.. సూపర్‌-4లో భారత్‌, పాక్‌ జట్లకే తొలి రెండు స్థానాల్లో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.కాబట్టి భారత్‌, పాక్‌లు ఈ రెండు ఆదివారాలు తలపడే అవకాశం ఉంది. అయితే అన్నీ అనుకున్నట్లుగా జరిగితేనే ఇది వర్కవుట్ అవుతుంది.