IND vs WI 1st ODI 2019: 50 ఓవర్లలో 8 వికెట్లకు 288 పరుగులు చేసిన భారత్, వెస్టిండీస్ విజయలక్ష్యం 289, రాణించిన శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్
Shreyas Iyer and Rishabh Pant (Photo Credits: Getty Images)

Chennai, December 15: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో (MA Chidambaram stadium in Chennai) వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి వన్డేలో (Ind vs Wi 1st ODI)టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 288 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మిడిలార్డర్ చలవతో భారీ స్కోరు నమోదు చేసింది. టాపార్డర్ లో రోహిత్ శర్మ 36 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ (4), ఓపెనర్ కేఎల్ రాహుల్ (6) విఫలమయ్యారు.

దాంతో ఇన్నింగ్స్ నడిపించే బాధ్యత స్వీకరించిన యువ జోడీ శ్రేయాస్ అయ్యర్ (70), (Shreyas Iyer) రిషబ్ పంత్ (71) (Rishabh Pant) విలువైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు. కేదార్ జాదవ్ కూడా తనవంతు పాత్ర సమర్థంగా పోషించి 40 పరుగులు చేశాడు. చివర్లో జడేజా (21) రనౌట్ గా వెనుదిరిగాడు. భారీ షాట్లు ఆడతాడని పేరున్న శివం దూబేను విండీస్ బౌలర్లు 9 పరుగులకే కట్టడి చేశారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, కీమో పాల్, అల్జారి జోసెఫ్ రెండేసి వికెట్లు తీయగా, కెప్టెన్ పొలార్డ్ కు ఓ వికెట్ దక్కింది.