Team India. (Photo- BCCI)

వన్డే ప్రపంచకప్‌-2023కు ముందు మరో కీలకపోరుకు టీమిండియా రెడీ అయింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.ఇందుకోసం ఇరు దేశాల క్రికెట్‌ బోర్డు ఇప్పటికే తమ జట్లను కూడా ప్రకటించాయి.సెప్టెంబర్ 22 నుంచి ఈ ద్వైపాక్షిక సిరీస్‌ ప్రారంభం కానుంది.ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌, జట్లు, మ్యాచ్‌ ఆరంభ సమయం లైవ్‌ స్ట్రీమింగ్‌ తదితర వివరాలు ఇవిగో..

ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు భారత జట్టు: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణ

ఆసియా కప్‌లో ఓడినా మళ్లీ పాకిస్తానే నంబర్ వన్, భారత్ రికార్డు స‌‌‌ృష్టించాలంటే అక్కడ కచ్చితంగా గెలవాల్సిందే, తాజా ICC పురుషుల ODI టీమ్ ర్యాంకింగ్‌లు ఇవిగో..

ఆసీస్‌తో మూడో వన్డేకు భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్ సిరాజ్

టీమిండియాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్‌, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్ , మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

వన్డే సిరీస్‌ షెడ్యూల్‌..

మొదటి వన్డే: 22 సెప్టెంబర్ 2023, శుక్రవారం

వేదిక: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్‌ బింద్రా స్టేడియం, మొహాలీ

ప్రారంభ సమయం: మధ్యాహ్నం 01:30

రెండో వన్డే: 24 సెప్టెంబర్ 2023, ఆదివారం

వేదిక: హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్

ప్రారంభ సమయం: మధ్యాహ్నం 01:30

మూడో వన్డే: 27 సెప్టెంబర్ 2023, బుధవారం

వేదిక: సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, రాజ్‌కోట్

ప్రారంభ సమయం: మధ్యాహ్నం 01:30

ఇండో-ఆసీస్‌ వన్డే సిరీస్‌ ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ అంటే?

భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ స్పోర్ట్స్ 18 ఇంగ్లీష్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే జియో సినిమాలో మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించవచ్చు.