IND vs ENG 3rd Test: ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టిన భారత్, మూడో టెస్టులో తొలి సెషన్‌లోనే ఆరు వికెట్లు లాస్, 28 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసిన ఇంగ్లండ్
పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు స్కోర్ 2 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ ఆటగాడు సిబ్లే డకౌట్ అయ్యాడు.
ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు గుజరాత్ లోని మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Cricket Stadium) ప్రారంభమైంది. డేనైట్ టెస్ట్ అయిన ఈ మ్యాచులో ( India vs England 3rd Test) ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ స్టేడియం ఇటీవలే నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ స్టేడియం కెపాసిటీ లక్షా 10 వేలు. ఈ స్టేడియంకు 'నరేంద్ర మోదీ స్టేడియం' అని పేరు పెట్టారు. మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా పేసర్ ఇషాంత్ శర్మ 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది.
పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు స్కోర్ 2 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ ఆటగాడు సిబ్లే డకౌట్ అయ్యాడు. ఇషాంత్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇషాంత్‌కిది వందో టెస్టు కావడం విశేషం. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన బెయిర్‌స్టో కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఓపెన్ జాక్ క్రాలే(23 బ్యాటింగ్), కెప్టెన్ జోరూట్(3 బ్యాటింగ్) ఉన్నారు.
తొలి సెషన్ విరామం అనంతరం తొలి ఓవర్‌లోనే ఓలీ పోప్ రూపంలో ఐదో వికెట్‌ను కోల్పోయింది. అశ్విన్ వేసిన 27వ ఓవర్ నాలుగో బంతి పోప్ హిట్ చేసే ప్రయత్నం చేయగా.. బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 53 పరుగులతో నిలకడగా ఆడుతున్న జాక్ క్రావ్లే అక్షర్ బౌలింగ్ అవుటవడంతో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన కెప్టెన్ జో రూట్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ 74 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయింది.అశ్విన్ వేసిన బంతి రూట్ ప్యాడ్లను తాకుతూ లెగ్ స్టంప్ మీదుగా వెళ్లింది. టీమిండియా అప్పీల్ చేయగా అంపైర్ అవుటిచ్చాడు. అయితే రూట్ రివ్యూకు వెళ్లగా అతనికి నిరాశ ఎదురైంది.
28 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్ ఆరు వికెట్లు కోల్పోయి 81 పరుగులు.
జట్ల వివరాలు:
ఇండియా:
రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, బుమ్రా.
ఇంగ్లండ్ జట్టు:
డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలే, జానీ బెయిర్‌స్టో, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.
(The above story first appeared on LatestLY on Feb 24, 2021 05:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

