india vs england ( photo credit : PTI)

టీమిండియా -ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ బుధవారం నుంచి ఆరంభం కానుంది. ఆగష్టు 4 నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్‌ల సిరీస్‌ (India vs England Test Series 2021 Schedule) కోసం ఇప్పటికే కోహ్లి సేన, జో రూట్‌ బృందం సన్నద్ధమయ్యాయి.ఈ ఏడాది భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్‌, టీమిండియా (Team India) చేతిలో ఓటమి పాలై 3-1 తేడాతో సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

దీనికి ెలాగైనా కసి తీర్చుకోవాలని స్వదేశంలో భారత జట్టుపై పైచేయి సాధించాలని జో రూట్‌ సేన (England) రెడీ అవుతోంది. విదేశంలో ఎలాగైనా మరో సిరీస్ సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. కాగా ఇరుజట్లు తమ గత మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి చవిచూసిన విషయం విదితమే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్‌ కివీస్‌ చేతిలో పరాజయం పాలు కాగా, అంతకంటే ముందు జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌ న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయి సిరీస్‌ను అప్పగించింది.

బాధపడకండి, గెలుపోటములు సహజం, కాంస్యం కోసం పోరాడండి. హాకీ సెమీస్‌లో భారత్ ఓటమిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు

టీమిండియా- ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌

►భారత కాలమానం ప్రకారం, ఐదు మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ఆరంభం కానున్నాయి.

మొదటి టెస్టు: ఆగష్టు 4- 8, నాటింగ్‌ హాం, ట్రెంట్‌ బ్రిడ్జి మైదానం

రెండో టెస్టు: ఆగష్టు 12- 16, లండన్‌, లార్డ్స్‌ మైదానం

మూడో టెస్టు: ఆగష్టు 25- 29, లీడ్స్‌, హెడింగ్లీ మైదానం

నాలుగో టెస్టు: సెప్టెంబరు 2-6, లండన్‌, ఓవల్‌ మైదానం

ఐదో టెస్టు: సెప్టెంబరు 10-14, మాంచెస్టర్‌, ఎమిరేట్స్‌ ఓల్డ్‌ ట్రఫోర్ట్‌

జట్ల అంచనా:

టీమిండియా: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే, అభిమన్యు ఈశ్వరన్‌, హనుమ విహారి, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, రిషబ్‌ పంత్‌, వృద్ధిమాన్‌ సాహా, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌, (శ్రీలంక పర్యటనలో కరోనా కలకలం కారణంగా సూర్యకుమార్‌ యాదవ్‌, పృథ్వీ షా జట్టుతో ఆలస్యంగా కలిసే అవకాశం ఉంది).

ఇంగ్లండ్‌: జో రూట్‌(కెప్టెన్‌), రోరీ బర్న్స్‌, డొమినిక్‌ సిబ్లే, జోస్‌ బట్లర్‌, మార్క్‌ వుడ్‌, సామ్‌ కరన్‌, జేమ్స్‌ ఆండర్సన్‌, జానీ బెయిర్‌స్టో, డొమినిక్‌ బెస్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జాక్‌ క్రాలే, హసీబ్‌ హమీద్‌, డాన్‌ లారెన్స్‌, జాక్‌ లీచ్‌, ఓలీ పోప్‌, ఓలీ రాబిన్‌సన్‌, క్రేగ్‌ ఓవర్టన్‌.