టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ కివీస్ దే పైచేయిగా నిలిచింది. నిన్న తొలి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా, ఇవాళ్టి ఉదయం టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్ల విజృంభణతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయింది. క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు ఉపయోగపడే పనులేవీ చేతకావా అంటూ మండిపడుతున్నారు. బ్యాటింగ్‌తో పాటు.. ఫీల్డింగ్‌లోనూ విఫలం కావడాన్ని విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
వీడియో ఇదిగో, సర్ఫరాజ్ ఖాన్ ను తిడుతూ ఫైర్ అయిన రోహిత్ శర్మ, ఇంత కోపమెందుకు అంటున్న నెటిజన్లు
బ్యాటింగ్‌లో విఫలమై పరుగుల ఖాతా తెరవకుండానే అవుటైన రాహుల్.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఈజీ క్యాచ్‌ను వదిలేశాడు. పదమూడవ ఓవర్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన రెండో బంతి.. కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ బ్యాట్‌ను తాకి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుంది. ఈ క్రమంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి, రాహుల్ మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. అయితే, బంతి తన వైపునకే వస్తున్నా రాహుల్ క్యాప్ పట్టడంలో నిర్లక్ష్యం వహించాడు. దీంతో రాహుల్ చేతిని తాకి మిస్ అయిన బాల్.. బౌండరీ వైపు వెళ్లింది. దీంతో కివీస్ ఖాతాలో నాలుగు పరుగులు చేరాయి.
Here's Rahul Catch Miss Video
You can't convince me that kl Rahul didn't drop this catch intentionally.
Rohit Sharma is surrounded by snakes. 💔
— Vishu (@Ro_45stan) October 17, 2024
ఈ క్రమంలో బౌలర్ సిరాజ్ తీవ్ర అసంతృప్తికి లోనుకాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం.. ‘‘అసలేం ఏం చేశావు నువ్వు?’’ అన్నట్లుగా రాహుల్‌వైపు చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో రాహుల్ కావాలనే క్యాచ్ విడిచిపెట్టినట్లుగా ఉందంటూ టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.