Lauderhill, AUG 08: వెస్టిండీస్ తో (West Indies) జరిగిన 5వ చివరి టీ20 మ్యాచ్ లోనూ భారత్ (India) అదరగొట్టింది. విండీస్ పై ఘన విజయం సాధించింది (India Won). 88 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది టీమిండియా. 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. రెగులర్ ఇంటర్ వెల్స్ లో వికెట్లు కోల్పోయింది. 15.4 ఓవర్లలోనే 100 పరుగులకు విండీస్ ఆలౌట్ అయ్యింది. శ్రేయస్ అయ్యర్ (64) (Shreyas Iyer) మెరుపు ఇన్నింగ్స్‌కు బౌలర్ల సమష్టి కృషి తోడవ్వడంతో ఫ్లోరిడా వేదికగా జరిగిన నామమాత్రపు ఐదో మ్యాచ్‌లో 88 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపొందింది.
5TH T20I. India Won by 88 Run(s) https://t.co/G0Cy5mICB4 #WIvIND
— BCCI (@BCCI) August 7, 2022
విండీస్ బ్యాటర్లలో షిమ్రోన్ హెట్మయేర్ (Shimron Hetmyer) ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. హెట్మయేర్ 35 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ (Ravi bishnoi) నాలుగు వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), అక్షర్ పటేల్ (Axar Patel) తలో మూడు వికెట్లు తీశారు. నామమాత్రమైన ఐదో టీ20 మ్యాచ్‌లో టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ (64) హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీపక్ హుడా (38), హార్దిక్ పాండ్యా (28) రాణించారు. ఇషాన్ కిషన్ 11, సంజూ శాంసన్ 15, దినేశ్ కార్తిక్ 12, అక్షర్ పటేల్ 9 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో ఓడియన్ స్మిత్ 3 వికెట్లు తీశాడు. హేడెన్ వాల్ష్, జాసన్ హోల్డర్, డొమినిక్ డ్రేక్స్ తలో వికెట్ పడగొట్టారు. ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్.. 4-1 తో ఆధిక్యంలో నిలిచింది.