File Image of Wankhede Stadium (Photo Credits: Wikimedia Commons)

ఐపీఎల్‌ 14వ సీజన్‌ 2021 ఆరంభానికి ముందే కరోనావైరస్ కలకలం రేపింది. తాజాగా ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందిలో 8 మందికి కరోనా పాజిటివ్‌గా (Eight groundsmen at Wankhede Stadium test positive) నిర్థారణ అయింది. కరోనా పాజటివ్‌గా సోకిన వారందరిని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. దీంతో ఏప్రిల్‌ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌, సీఎస్‌కే మధ్య జరగనున్న లీగ్‌ మ్యాచ్‌ను నిర్వహించాలా వద్దా అనే దానిపై బీసీసీఐ తర్జన భర్జన పడుతోంది. తాజాగా కరోనా కేసులు వెలుగు చూడడంతో వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన చేస్తుంది.

కాగా దేశంలో కరోనా కేసుల పెరుగుదల ఎక్కువగా ఉండడంతో ఈసారి ఐపీఎల్‌ సీజన్‌ను 6 వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీ వేదికలుగా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఐపీఎల్‌లో ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలకు హోం అడ్వాంటేజ్‌ లేకుండా ఆరు వేదికల్లో మ్యాచ్‌లు ఆడేలా ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ఇంకా ఆరు రోజులే మిగిలిఉన్న నేపథ్యంలో తాజాగా వాంఖడే స్టేడియం సిబ్బందికి కరోనా సోకడంతో కలవరం మొదలైంది.

వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్న ఇండియా, అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లండ్, మూడవ స్థానంలో న్యూజీలాండ్, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా, ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా జట్లు

ఇదిలా ఉంటే ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లో కరోనా వైరస్‌ కలవరం రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. మొన్న కేకేఆర్‌ సభ్యుడు నితీష్‌ రాణా కరోనా బారిన పడగా, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అక్షర్‌ పటేల్‌కు కరోనా బారిన పడి ఐసోలేషన్‌కు వెళ్లిన కొన్ని గంటల వ్యవధిలోనే సీఎస్‌కే సిబ్బందిలో ఒకరికి కరోనా వచ్చింది. ఇది సీఎస్‌కే జట్టులో ఒక్కసారిగా ఆందోళన రేకెత్తించింది. కాగా, జట్టులోని సభ్యులు కానీ, కోచింగ్‌ స్టాఫ్‌కు కానీ ప్లేయర్స్‌ కానీ కరోనా రాకపోవడంతో సీఎస్‌కే యాజమాన్యం కాస్త ఊపిరి పీల్చుకుంది.

ఏప్రిల్‌10 తేదీన ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌-సీఎస్‌కే జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ తరుణంలో ఢిల్లీలోని ఆటగాడు అక్షర్‌కు, ఇటు సీఎస్‌కే సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్‌ సోకడం కలకర పరుస్తోంది. ప్రస్తుతం అంతా క్వారంటైన్‌ నిబంధనల్ని పాటిస్తూ తమ తమ ప్రాక్టీస్‌ చేస్తున్నా కరోనా వైరస్‌ ఐపీఎల్‌పై ప్రభావం చూపించేలా కనిపిస్తోంది.