IPL Logo (Photo Credits: IANS)

ఐపీఎల్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. తాజాగా మరో ఇద్దరు క్రికెటర్లు కోవిడ్‌ బారిన పడ్డారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderbad) ఆటగాడు వృద్ధిమాన్‌ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్‌ మిశ్రాకు (Delhi Capitals' Amit Mishra) కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.

ఇక కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జట్లు ఐసోలేషన్‌లో ఉండటం, బయో బబుల్‌లో ఉన్నా ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండటంతో టోర్నీని నిరవధికంగా వాయిదా (IPL 2021 Suspended) వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ధ్రువీకరించారు.

బయోబబుల్‌ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లలో ఇద్దరికి కరోనా సోకడం, ఆపై ఆ జట్టంతా ఐసోలేషన్‌లోకి వెళ్లడం జరిగాయి. ఫలితంగా సోమవారం(మే3వ తేదీ) ఆర్సీబీ-కేకేఆర్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడింది.  ఇదిలాఉంచితే, తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ క్యాంప్‌లోనూ కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆరు విజయాలతో ఢిల్లీ ధనాధన్, తాజాగా 7 వికెట్లతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్,సెంచరీకి పరుగు దూరంలో నిలిచిన మయాంక్‌ అగర్వాల్‌

ఆదివారం వచ్చిన ఫలితాల్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కరోనా బారిన పడినట్లు సమాచారం. సీఎస్‌కే జట్టులో మరో ఇద్దరికి కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. దాంతో ఈ ముగ్గురినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. వీరికి నెగిటివ్‌ వస్తే కానీ బయోబబుల్‌లో చేరడానికి అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది.

తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ గ్రౌండ్ స్టాఫ్ కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దాదాపు ఐదుగురు మైదాన సిబ్బంది కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికారికంగా వెల్లడికావడం సంచలనంగా మారింది. ప్రస్తుతం వారందరూ ఐసొలేషన్‌కు వెళ్లిపోయారని, ఢిల్లీ వైద్య బృందం వారికి ప్రత్యేక చికిత్స అందిస్తోందని అధికారులు చెప్పారు.