IPL Logo (Photo Credits: IANS)

క్రికెటర్లను స్టార్లుగా మార్చడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) తర్వాతే మిగతా టోర్నీలు. ఈ టోర్నమెంట్‌లో రాణించి, కేవలం ఆ ప్రదర్శన ఆధారంగా భారత జట్టులో చాలామంది చోటు సంపాదించుకున్నారు. ఇప్పుడు తాజాగా వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌ కోసం రిటెన్షన్ (IPL 2022 Retention) ప్రక్రియ పూర్తయింది. ఈ రిటెన్షన్లలో భారీ మొత్తంలో ఆదాయం పొందిన ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే అంతకుముందు సీజన్‌తో పోల్చుకుంటే తమ జీతాలు ఒక రేంజ్‌లో పెంచుకున్న ఆటగాళ్లు ఉన్నారు.

పంజాబ్‌ కింగ్స్ 2018 మెగా వేలంలో రూ.కోటి రూపాయలు చెల్లించి, మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేసింది. ఈసారి ఏకంగా రూ.12 కోట్లు చెల్లించి మరీ అతన్ని రిటైన్ చేసుకుంది. అంటే అతని జీతం ఏకంగా 12 రెట్లు పెరిగిందన్నమాట. ఇప్పటి వరకూ 100 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన మయాంక్.. 2135 పరుగులు చేశాడు. దీనిలో 11 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. కేఎల్‌ రాహుల్ ఈ ఫ్రాంచైజీ నుంచి వెళ్లిపోవడంతో ఆ జట్టు పగ్గాలు మయాంక్‌కు అప్పగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

పంజాబ్ కింగ్స్ జట్టు ఆటగాడు. 22 ఏళ్ల వయసులోనే అద్భుతమైన పేసర్‌గా అందరి దృష్టినీ ఆకర్షించాడీ కుర్రాడు. అప్పట్లో అతన్ని రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్‌.. ఈసారి రూ.4 కోట్లు పెట్టి అతన్ని రిటైన్ చేసుకుంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 23 మ్యాచ్‌లు ఆడిన అర్షదీప్‌ 30 వికెట్లు కూల్చాడు. అతని యావరేజ్‌ 22.3, స్ట్రైక్‌ రేట్‌ 15.23 మాత్రమే కావడం గమనార్హం. అర్షదీప్ శాలరీ హైక్ ఏకంగా 2000 శాతం పెరిగింది.

రూ. 16 కోట్లతో రోహిత్‌‌ను రీటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్, రూ. 15 కోట్లతో విరాట్‌ కోహ్లిను రీటైన్ చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

జమ్మూకశ్మీర్‌కు చెందిన అబ్దుల్ సమద్‌ పేరు ఎవరికీ పెద్దగా తెలీదు. హార్డ్ హిట్టర్‌గా దేశవాళీల్లో రాణించిన సమద్‌.. లెగ్‌ బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరఫున ఐపీఎల్‌ ఆడిన అతను సాధించింది తక్కువే. అయితే ఈసారి ఏకంగా రూ.4 కోట్లు చెల్లించి అతన్ని సన్ రైజర్స్ రిటైన్ చేసుకుంది. గతంలో అతని రేటు రూ.20 లక్షలే. అంటే సుమారు 20 రెట్లు పెరిగిందన్నమాట.

ఐపీఎల్‌2021లో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న యువ ట్యాలెంట్‌ రుతురాజ్ గైక్వాడ్‌. గత ఐపీఎల్‌ సీజన్‌లో ఏకంగా ఏడు అర్ధశతకాలు, ఒక సెంచరీ బాదాడు. గత సీజన్‌లో బేస్‌ప్రైజ్‌ రూ.20 లక్షలకు అతన్ని దక్కించుకున్న చెన్నై.. ఈసారి ఏకంగా రూ.6 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకుంది. ఈ క్రమంలో అతని విలువ ఏకంగా 30 రెట్లు పెరగడం గమనార్హం.

ఐపీఎల్‌2021 రెండో దశలో అద్భుతంగా రాణించి, కోల్‌కతా జట్టు ఫైనల్స్ చేరడంలో కీలక పాత్ర పోషించిన వారిలో వెంకటేశ్‌ అయ్యర్ కూడా ఉన్నాడు. ఇతని కోసం కోల్ కతా ఏకంగా రూ.8 కోట్లు వెచ్చించింది. ఈ 26 ఏళ్ల ఆల్‌రౌండర్‌ ఆడింది కేవలం పది ఐపీఎల్‌ మ్యాచులే. వీటిలోనే 128.47 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 370 పరుగులు చేశాడు. అతని యావరేజ్‌ 41.11గా ఉంది.