IPL Trophy (Photo credit: iplt20.com)

ఇప్పటికే 15 సీజన్ల పాటు సూపర్‌ సక్సెస్‌ అయిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)16 వ సీజన్‌ షెడ్యూల్‌ ఎట్టకేలకు విడుదలైంది. ఐపీఎల్‌ 16వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌, మ్యాచ్‌ల వివరాలను బీసీసీఐ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్‌ 2023 ఎడిషన్‌కు తెరలేవనుంది. ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఆరంభ వేడుకలను అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 షెడ్యూల్ ఇదిగో, అందరి కళ్లు సామ్‌ కర్రన్‌ పైనే, రు. 18.5 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనున్నాయి. మార్చి 31 నుంచి మే 21 వరకు లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌ మే 28న జరగనుంది. మొత్తం 70 మ్యాచ్‌లు జరగనుండగా ఇందులో 18 డబుల్‌ హెడర్స్‌ ఉన్నాయి.ఏడేసి మ్యాచ్‌లను సొంత మైదానం, వెలుపల స్టేడియాల్లో ఆడాల్సి ఉంటుంది. ప్లేఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇక ఐపీఎల్‌లో పాల్గొననున్న జట్లలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మ్యాచ్‌లన్నీ స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రసారం కానున్నాయి.

ipl

గ్రూప్‌ - Aలో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్, దిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఉన్నాయి. గ్రూప్‌ - Bలో చెన్నై సూపర్‌ కింగ్స్, సన్‌ రైజర్స్ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్, గుజరాత్‌ టైటాన్స్‌ ఉన్నాయి.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్, రూ.18.50 కోట్ల‌కు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

మొత్తం మ్యాచుల కోసం 12 వేదికలను ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. అహ్మదాబాద్‌, మొహాలి, లఖ్‌నవూ, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, జయ్‌పుర్, ముంబయి, గువాహటి, ధర్మశాల వేదికలుగా మ్యాచ్‌లు జరుగుతాయి.