IPL Auction 2024: సామ్ కర్రాన్ రూ.18.50 కోట్ల ఆల్-టైమ్ రికార్డు బద్దలు కొట్టేది ఇతడే, ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్‌‌ను వేలంలో ఎవరూ కొనరని తెలిపిన టామ్ మూడీ
Mitchell Starc, Steve Smith (photo-X/ICC)

దుబాయ్ వేదికగా నేడు ఐపీఎల్ 2024 మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో అత్యధిక ధర పలకనున్న ఆటగాడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ వంటి స్టార్లు వేలానికి అందుబాటులో ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉండడంతో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ ఆటగాడు, సన్‌రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సారి సామ్‌ కర్రన్‌ కన్నా ఎక్కువ రేటు పలికే ఆటగాడు ఎవరు ? ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల లిస్ట్ ఇదిగో, పది ఫ్రాంచైజీల వద్ద ఉన్న నగదు ఎంతంటే..

ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోతాడని తాను భావించడంలేదని టామ్ మూడీ అంచనా వేశారు. ఇక ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రాన్ పేరిట ఉన్న రూ.18.50 కోట్ల ఆల్-టైమ్ రికార్డు వేలం ధరను మిచెల్ స్టార్క్ బద్దలు కొడతాడని జోస్యం చెప్పాడు. పంజాబ్ కింగ్స్ విడుదల చేసిన తమిళనాడు క్రికెటర్ షారుఖ్ ఖాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ దక్కించుకునే అవకాశం ఉందని టామ్ మూడీ పేర్కొన్నాడు. వేలం తర్వాత కూడా గుజరాత్ టైటాన్స్ వద్దే ఎక్కువ మొత్తం మిగులుతుందని అన్నాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.