Newdelhi, July 23: టీమిండియా (Team India) మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ లో సందడి చేయనున్నట్టు సమాచారం. భారత సీనియర్ క్రికెట్ జట్టుకు కోచింగ్ బాధ్యతల నుంచి ఇటీవల తప్పుకున్న ద్రావిడ్.. ఇప్పుడు ఐపీఎల్ లో మెంటర్ పాత్ర పోషించేందుకు రెఢీ అవుతున్నట్లు తెలిసింది. రాజస్థాన్ రాయల్స్ తో ఆయన చర్చల్లో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. టీమిండియా జట్టుకు కోచింగ్ బాధ్యతలు కొనసాగించేందుకు ద్రావిడ్ ఆసక్తిగా లేడు. ఏడాదికి పది నెలలు జట్టుతో గడపాల్సి వస్తున్న కారణంగా అతను హెడ్ కోచ్ గా కొనసాగేందుకు నిరాకరించాడు.
కెనడాలో స్వామి నారాయణ్ ఆలయంపై మరోసారి దాడి.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు
#IPL #IPL2025 #RahulDravid may return to #RajasthanRoyals as head coach 🏏
Details ➡️ https://t.co/5eem4WRUhX pic.twitter.com/TFtmv8MAUt
— TOI Sports (@toisports) July 23, 2024
తొలుత అలా..
కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీతో జత కలిసేందుకు ద్రావిడ్ ఆసక్తిగా ఉన్నట్లు తొలుత వార్తలు వ్యాపించాయి. గంభీర్ స్థానంలో ద్రావిడ్ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు భావించారు. కానీ ఆ జట్టుతో కలిసేందుకు రాహుల్ ద్రావిడ్ ఇంట్రెస్టింగ్ గా లేనట్లు తెలుస్తోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో ఆయన చర్చల్లో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గతంలోనూ ఐపీఎల్ జట్లకు మెంటర్ గా, కోచ్ గా ద్రావిడ్ చేశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ కు కోచ్ గా సేవలు అందించాడు.
భార్యతో భర్త అసహజ శృంగారం చేయడం అత్యాచారం కిందకు రాదు, భార్య పిటిషన్ కొట్టేసిన ఉత్తరాఖండ్ హైకోర్టు