Jadeja Double Century: డబుల్ సెంచరీతో దడపుట్టించిన జడేజా, 200 వికెట్లతో సరికొత్త రికార్డు నమోదు, అతి తక్కువ టెస్ట్‌ల్లో ఈ ఘనతను సాధించిన లెఫ్మార్మ్ బౌలర్‌ జడేజానే
Jadeja fastest left-arm bowler to 200 Test wickets (photo-Ians)

Visakhapatnam,October 4: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.టెస్టుల్లో అత్యంత వేగవంతంగా రెండొందల వికెట్ల మార్కును చేరిన ఎడమ చేతి వాటం బౌలర్‌గా సరికొత్త రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు 198 వికెట్లతో ఉన్న జడేజా డేన్ పీడ్త్, ఎల్గర్‌లను పెవిలియన్‌కు పంపడం ద్వారా 44వ టెస్టుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో జడేజా ఈ ఫీట్‌ను నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు 198 వికెట్లతో ఉన్న జడేజా.. డానీ పీడ్త్‌, ఎల్గర్‌ వికెట్లను సాధించి ‘డబుల్‌ సెంచరీ’ కొట్టేశాడు. కాగా, ఇది జడేజా 44వ టెస్టు. ఫలితంగా అతి తక్కువ టెస్టుల్లో 200 వికెట్లను సాధించిన లెఫ్టార్మ్‌ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అతి తక్కువ టెస్టుల్లోనే 200 వికెట్లు పడగొట్టిన జడేజా ఈ క్రమంలో శ్రీలంక బౌలర్ రంగన హెరాత్ రికార్డును బద్దలుగొట్టాడు. హెరాత్ 47 టెస్టుల్లో 200 వికెట్లు పడగొట్టగా జడేజా అతడి కంటే మూడు టెస్టుల ముందే ఈ ఘనత అందుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ (49 టెస్టులు), ప్రస్తుత బౌలర్ మిచెల్ స్టార్క్ (50 టెస్టులు), ఆ తర్వాతి స్థానంలో 51 టెస్టులతో టీమిండియా మాజీ ఆటగాడు బిషన్‌సింగ్ బేడీ, పాక్ మాజీ ఆటగాడు వాసిం అక్రమ్‌లు ఉన్నారు.