Jasprit Bumrah (Photo credit: Twitter)

ఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాణించిన అతడు ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. మూడు స్థానాలు ఎగబాకి 718 పాయింట్లతో వరల్డ్‌ నంబర్‌ వన్‌ వన్డే బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా మినహా మరే ఇతర టీమిండియా బౌలర్లు టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయారు.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో బుమ్రా 7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అదే విధంగా ఇంగ్లండ్‌ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి పేసర్‌గా నిలిచాడు బుమ్రా. ఆరేళ్ల తర్వాత వన్డేల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు.

భారత్ మీద ఈ సారి గెలుపు అంత ఈజీ కాదు, పాకిస్తాన్ టీంకు వార్నింగ్ ఇచ్చిన షోయబ్ అక్తర్, ఇండియా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతుందని వెల్లడి

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ఉన్న బౌలర్లు వీళ్లే!

1.జస్‌ప్రీత్‌ బుమ్రా(ఇండియా)

2.ట్రెంట్‌ బౌల్ట్‌(న్యూజిలాండ్‌)

3.షాహిన్‌ ఆఫ్రిది(పాకిస్తాన్‌)

4.జోష్‌ హాజిల్‌వుడ్‌(ఆస్ట్రేలియా)

5.ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌(అఫ్గనిస్తాన్‌)

6.మెహెదీ హసన్‌(బంగ్లాదేశ్‌)

7.క్రిస్‌ వోక్స్‌(ఇంగ్లండ్‌)

8. మ్యాట్‌ హెన్రీ(న్యూజిలాండ్‌)

9.మహ్మద్‌ నబీ(అఫ్గనిస్తాన్‌)

10. రషీద్‌ ఖాన్‌(అఫ్గనిస్తాన్‌)