టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బుమ్రా పరిస్థితిని నిపుణులైన వైద్యబృందం పరిశీలించిందని, అతడు వరల్డ్ కప్ లో ఆడే అవకాశాలు లేవని ఆ బృందం నిర్ధారించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి పేరును త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

కాగా వీపు గాయంతో బుమ్రా ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియాలో జరగనుంది. టీమిండియా ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో అక్టోబరు 23న ఆడనుంది. పేస్ కు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్ లపై బుమ్రా ఎంతో ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)