
చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లీష్ టీమ్ దారుణంగా పెర్ఫార్మ్ చేయడంతో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి (England White Ball Captaincy) జోస్ బట్లర్ (Jos Buttler) రాజీనామా చేశాడు. సౌతాఫ్రికాతో రేపు (మార్చి 1) జరుగబోయే మ్యాచ్ ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా బట్లర్‌కు చివరిది. 2022 జూన్‌లో బట్లర్ ఇంగ్లండ్ ఫుల్ టైమ్ వైట్ బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
ఇయాన్ మోర్గాన్ నుంచి బట్లర్ బాధ్యతలు స్వీకరించాడు. కరాచీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్ సారథిగా తనకు ఆఖరిదని బట్లర్ వెల్లడించాడు. చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ వైట్‌బాల్ కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు అతడు తెలిపాడు.
బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 12 మ్యాచ్‌ల్లో గెలిచి 22 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఏడో స్థానంలో నిలిచి, సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించింది. వన్డే వరల్డ్‌కప్ తర్వాత బట్లర్ నేతృత్వంలో ఇంగ్లండ్ 17లో 13 వన్డేలు ఓడింది.బట్లర్ సారథ్యంలో ఇంగ్లండ్ 2022 టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఏడో స్థానంలో నిలిచి, సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించింది. జోస్ బట్లర్ స్థానంలో ఇంగ్లండ్ కొత్త సారథిగా ఎవర్ని నియమిస్తారో చూడాలి.