ప్లేఆఫ్స్‌లో భాగంగా అహ్మదాబాద్ స్టేడియంలో హైదరాబాద్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. దీంతో నాలుగవసారి ఆజట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. రాహుల్ త్రిపాఠి (55) అర్ధశతకం చేయగా, క్లాసెన్ (32), కమిన్స్ (30) విలువైన పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో స్టార్క్ 3, చక్రవర్తి 2, అరోరా, రాణా, నరైన్, రస్సెల్ ఒక్కో వికెట్ తీశారు. రిటైర్మైంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ, కచ్ఛితంగా ఓ ముగింపు తేదీ అనేది ఉంటుందంటూ..
అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ (51*), శ్రేయస్ అయ్యర్ (58*) అర్ధశతకాలతో చెలరేగారు. కోల్‌కతా13.4 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. దాంతో, అన్ని విభాగాల్లోతేలిపోయిన కమిన్స్ సేన ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్ 2లో ఆడేందుకు ఎదురుచూడనుంది.