Odisha, June 12:  భారత్ తీరు మారలేదు. మరో ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికాతో (South Africa) రెండో టీ20లోనూ టీమిండియా (Team India) పరాజయం పాలైంది. కటక్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షో సఫారీలు అదరగొట్టారు. 4 వికెట్లతో గెలుపొందారు. తొలి టీ20లో టీమిండియా పాలిట డేవిడ్ మిల్లర్ (Miller), వాన్ డర్ డుసెన్ విలన్లలా పరిణమిస్తే, ఈసారి ఆ పాత్రను వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ పోషించాడు. రెగ్యులర్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ గాయపడడంతో జట్టులోకి వచ్చిన క్లాసెన్ చితక్కొట్టాడు. 46 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. క్లాసెన్ స్కోరులో 7 ఫోర్లు, 5 భారీ సిక్సులున్నాయి.

అంతకుముందు కెప్టెన్ టెంబా బవుమా 35 (Temba Bavuma ) పరుగులు చేయగా, చివర్లో డేవిడ్ మిల్లర్ (David Miller)20 (నాటౌట్) పరుగులు చేసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత్ విసిరిన 149 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా, చహల్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.

Aiden Markram: దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం, స్టార్‌ బ్యాటర్‌ ఐడెన్ మార్క్రమ్‌ కు కోవిడ్   

ఈ విజయంతో దక్షిణాఫ్రికా జట్టు ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జూన్ 14న విశాఖపట్నంలో జరగనుంది. దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్ లో భారత్ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులే చేసింది. శ్రేయాస్ అయ్యర్ 40, ఇషాన్ కిషన్ 34, దినేశ్ కార్తీక్ 30 (నాటౌట్) పరుగులు చేశారు.

IND v SA, 1st T20I 2022: తొలి‌మ్యాచ్ లోనే బోల్తా పడిన టీం ఇండియా, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా 

ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (1), కెప్టెన్ రిషబ్ పంత్ (5), హార్దిక్ పాండ్యా (9) విఫలమయ్యారు. కీలక సమయాల్లో వికెట్లు తీయడం ద్వారా సఫారీ బౌలర్లు టీమిండియా భారీ స్కోరు ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఆన్రిచ్ నోర్జే రెండు వికెట్లు పడగొట్టాడు. రబాడా, వేన్ పార్నెల్, ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్ తలో వికెట్ తీశారు.