Quinton de Kock of Mumbai Indians (Photo Credits: Twitter)

కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియ‌న్స్‌ మరోసారి తన ఆధిపత్యాన్ని (MI vs KKR Stat Highlights IPL 2020) ప్రదర్శించింది. బౌలర్లు.. బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించడంతో రోహిత్‌ సేన 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వరుసగా 5 విజయాలు తన ఖాతాలో వేసుకుంది. కేకేఆర్‌పై చివరి 12 మ్యాచ్‌ల్లో ముంబైకిది 11వ గెలుపు కావడం విశేషం. అలాగే ఈ విజయంతో తిరిగి ముంబై 12 పాయింట్లతో టాప్‌కు చేరింది.

శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ( Kolkata Knight Riders) 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. పొట్టి ఫార్మాట్‌లో తొలిసారి ప్యాట్‌ కమిన్స్‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 నాటౌట్‌) అర్ధసెంచరీ సాధించగా కెప్టెన్‌ మోర్గాన్‌ (29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 నాటౌట్‌) సహకారం అందించాడు. రాహుల్‌ చాహర్‌ (2/18) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఆ తర్వాత ఛేదనలో ముంబై 16.5 ఓవర్లలో 2 వికెట్లకు 149 పరుగులు చేసి గెలిచింది. రోహిత్‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35), హార్దిక్‌ (11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 21 నాటౌట్‌) రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా డికాక్‌ నిలిచాడు.

149 పరుగుల లక్ష్య ఛేదనను ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) ఎలాంటి తడబాటు లేకుండా ముగించింది. తొలి బంతినే ఫోర్‌గా మలిచిన కెప్టెన్‌ రోహిత్‌.. ఆ తర్వాత మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదడంతో తొలి 18 బంతుల్లోనే జట్టు స్కోరు 30 పరుగులకు చేరింది. అటు డికాక్‌ కూడా వరుస ఫోర్లతో చెలరేగడంతో ఈ సీజన్‌లో ముంబై జట్టు తమ పవర్‌ప్లేలో 50+ స్కోరును సాధించడంతో పాటు ఒక్క వికెట్‌ను కూడా కోల్పోలేదు. ఆ తర్వాత ఏడో ఓవర్‌లో డికాక్‌ (Quinton De Kock Registers Third Half-Century) 4,6,4తో మరింత జోరు పెంచాడు.

అదేం బాదుడయ్యా డివిలియర్స్, కోలకతాను ఉతికేసిన బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్, 82 పరుగుల తేడాతో భారీ విజయం, మూడో ఓటమితో నిలిచిన కేకేఆర్‌

రస్సెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో మరో 4,6 బాది 25 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అటు చక్కగా సహకరించిన రోహిత్‌ను 11వ ఓవర్‌లో శివమ్‌ మావి అవుట్‌ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (10) ఈసారి నిరాశపరిచినా డికాక్‌ మాత్రం ధాటిని కొనసాగిస్తూ బౌండరీలతో లక్ష్యాన్ని వేగంగా తగ్గించాడు. ఇక 16వ ఓవర్‌లో హార్దిక్‌ 4,6,4తో కమిన్స్‌ను కుమ్మేయడంతో లక్ష్యం 4 ఓవర్లలో 8 పరుగులకు వచ్చింది. దీంతో మరో 19 బంతులుండగానే ముంబై విజయ లాంఛనం ముగించింది.

స్కోరు బోర్డు

కోల్‌కతా: రాహుల్‌ త్రిపాఠి (సి) సూర్యకుమార్‌ (బి) బౌల్ట్‌ 7; శుభ్‌మన్‌ గిల్‌ (సి) పొలార్డ్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 21; నితీష్‌ రాణా (సి) డికాక్‌ (బి) కల్టర్‌నైల్‌ 5; దినేశ్‌ కార్తీక్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 4; మోర్గాన్‌ (నాటౌట్‌) 39; రస్సెల్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 12; కమిన్స్‌ (నాటౌట్‌) 53; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 148/5; వికెట్ల పతనం: 1-18, 2-33, 3-42, 4-42, 5-61; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-32-1; కల్టర్‌నైల్‌ 4-0-51-1; బుమ్రా 4-0-22-1; క్రునాల్‌ 4-0-23-0; రాహుల్‌ చాహర్‌ 4-0-18-2.

ముంబై: రోహిత్‌ శర్మ (సి) కార్తీక్‌ (బి) శివమ్‌ మావి 35; డికాక్‌ (నాటౌట్‌) 78; సూర్యకుమార్‌ (బి) వరుణ్‌ 10; హార్దిక్‌ పాండ్యా (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 16.5 ఓవర్లలో 149/2; వికెట్ల పతనం: 1-94, 2-111; బౌలింగ్‌: గ్రీన్‌ 2.5-0-24-0; కమిన్స్‌ 3-0-28-0; ప్రసిద్ధ్‌ కృష్ణ 2-0-30-0; రస్సెల్‌ 2-0-15-0; వరుణ్‌ చక్రవర్తి 4-0-23-1; శివమ్‌ మావి 3-0-24-1.