Mumbai, May 13: ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ 15లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings) కథ ముగిసింది. ధోనీ సేన ఇంటి దారి పట్టింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై ఘోర పరాజయం పాలైంది. ముంబైతో(Mumbai) పోరులో ఓటమి చవిచూసిన చెన్నై.. ఫ్లే ఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంది. దాంతో పాటే ముంబై మాదిరే ఇంటిదారి పట్టింది. ముంబై బౌలర్ల ధాటికి తొలుత ధోనీ సేన 97 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబై 5 వికెట్లు కోల్పోయి 14.5 ఓవర్లలో 103 పరుగులు చేసి విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడంతో 97 పరుగులకే కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో ముంబై కూడా తడబడింది. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (6) తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. కాసేపటికే రోహిత్ శర్మ (18) కూడా అవుటయ్యాడు. వెంటనే డానియల్ శామ్స్ (1), ట్రిస్టన్ స్టబ్స్ (0) పెవిలియన్ చేరారు. అయితే తిలక్ వర్మ (34 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. అతనికి కాసేపు సహకారం అందించిన హృతిక్ షోకీన్ (18)ను మొయీన్ అలీ అవుట్ చేశాడు.
#MumbaiIndians register their third win of the season!
The Rohit Sharma -led unit beat #CSK by 5 wickets to bag two more points. 👏 👏
Scorecard ▶️ https://t.co/c5Cs6DHILi #TATAIPL #CSKvMI pic.twitter.com/gqV7iL5f4I
— IndianPremierLeague (@IPL) May 12, 2022
చివర్లో వచ్చిన టిమ్ డేవిడ్ (7 బంతుల్లో 16 నాటౌట్) రెండు భారీ సిక్సర్లతో ముంబైని విజయతీరాలకు చేర్చాడు. దీంతో 14.5 ఓవరల్లోనే ఐదు వికెట్ల తేడాతో ముంబై జట్టు గెలిచింది. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి మూడు వికెట్లతో సత్తా చాటగా.. సిమర్‌జీత్ సింగ్, మొయీన్ అలీ చెరో వికెట్ తీసుకున్నారు.
ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (34*) రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (18)(Rohit sharma), హృతిక్ షోకీన్ (18), టిమ్ డేవిడ్ (16*) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో ముంబై ఆరంభంలో తడబడినా.. చివరకు లక్ష్యాన్ని ఛేదించింది.
చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి మూడు వికెట్లు పడగొట్టాడు. మొయిన్ అలీ, సిమర్‌జిత్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు. ఈ విజయంతో ముంబైకి పెద్దగా ప్రయోజనం లేకపోయినా.. ఓడిపోయిన చెన్నై కూడా ఇంటిముఖం పట్టక తప్పదు.