Babar Azam (Photo Credits: @CricCrazyJohns/Twitter)

ఆసియాకప్‌ టైటిల్‌ ఫెవరేట్లలో ఒకటైన పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో బోణి కొట్టడం ద్వారా ఖాతాను ఓపెన్ చేసింది. సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో విజయాన్ని నమోదు చేసింది. నేపాల్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 238 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 342/6 స్కోరు చేసింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (131 బంతుల్లో 151, 14ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత సెంచరీకి తోడు ఇఫ్తికార్‌ అహ్మద్‌ (109 నాటౌట్‌) అరంగేట్రం సెంచరీతో కదంతొక్కారు. సోమ్‌పాల్‌(2/85) రెండు వికెట్లు తీశాడు.

ఒక్క మ్యాచ్‌కు కనీసం రూ. 60 కోట్లు, మీడియా రైట్స్ తో కాసుల వర్షం కురుస్తుందని భావిస్తున్న బీసీసీఐ, హక్కుల కోసం భారీ పోటీ

ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన నేపాల్‌..షాదాబ్‌ఖాన్‌ (4/27) ధాటికి 23.4 ఓవర్లలో 104 పరుగులకు కుప్పకూలింది. సోమ్‌పాల్‌ (28), ఆరిఫ్‌ షేక్‌(26) మినహా అందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. సెంచరీతో జట్టు భారీ స్కోరుకు కారణమైన ఆజమ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. నేడు శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది.