స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. T20 క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన రెండో ఇండియన్ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు.కాగా అశ్విన్ కంటే ముందే మరో ఇండియన్ బౌలర్ యజువేంద్ర చాహల్ 300 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. ప్రస్తుతం 311 వికెట్లతో అత్యధిక T20 వికెట్లు పడగొట్టిన ఇండియన్ బౌలర్‌గా చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు.
ఆ తర్వాత పీయూష్ చావ్లా 289, అమిత్ మిశ్రా 276 వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. ఇక ఇతర దేశాల బౌలర్‌లను కూడా పరిగణలోకి తీసుకుంటే వెస్టిండీస్ బౌలర్ డీజే బ్రావో 615 వికెట్లతో T20లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ (542), వెస్టిండీస్‌కు చెందిన మరో బౌలర్ ఎస్పీ నరైన్ (485), దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ (469), బంగ్లాదేశ్ బౌలర్ షకీల్ అల్ హసన్ (451), పాకిస్థాన్ బౌలర్ వహబ్ రియాజ్ (413) వరుసగా ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు.