RCB players celebrate (Photo Credits: @RCBTweets/Twitter)

ఆర్సీబీ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌ జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 6 పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలై ప్లే ఆఫ్స్‌ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌ (RCB vs PBKS IPL 2021) గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకుంది. పంజాబ్‌ గెలుపుకు ఆఖరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా, హర్షల్‌ పటేల్‌ అద్భుతంగా బౌల్‌ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆర్సీబీ బౌలర్లలో చహల్‌ 3 వికెట్లు, షాబాజ్‌ అహ్మద్‌, జార్జ్‌ గార్టన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ ప్లేఆప్స్‌లోకి ప్రవేశించగా.. మూడో జట్టుగా బెంగళూరు (Royal Challengers Bangalore Qualify for Playoffs) ముందంజ వేసింది.

ఆదివారం మ్యాచ్‌లో తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 164/7 స్కోరు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (33బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57) మెరుపు హాఫ్‌ సెంచరీ చేశాడు. దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (38బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లతో 40), విరాట్‌ కోహ్లీ (24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25), డివిల్లీర్స్‌ (18బంతుల్లో ఫోరు, 2సిక్సర్లతో 23) రాణించారు. హెన్రిక్స్‌, షమి చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం పంజాబ్‌ 20 ఓవర్లలో 158/6 స్కోరుకే పరిమితమైంది.

హైదరాబాద్ ఇంటికి..కోల్‌కతా ముందుకు, సన్ రైజర్స్‌పై 6 వికెట్లతో ఘన విజయాన్ని నమోదు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

మయాంక్‌ అగర్వాల్‌ (42బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), కేఎల్‌ రాహుల్‌ (35 బంతుల్లో ఫోర్‌, 2 సిక్స్‌లతో 39) సత్తా చాటారు. చాహల్‌ 3 వికెట్లు పడగొట్టాడు. మ్యాక్స్‌వెల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఐపీఎల్‌ లీగ్‌ దశ దాదాపు ముగింపునకు వచ్చింది. చెన్నై, ఢిల్లీ, బెంగళూరు జట్లకు ప్లేఆఫ్‌ స్థానాలు ఖరారయ్యాయి. ఇకపోతే మిగిలింది ఒక్కటే బెర్త్‌. దానికోసం కోల్‌కతా, రాజస్థాన్‌, ముంబై తలపడుతున్నాయి.

స్కోరుబోర్డు

బెంగళూరు: కోహ్లీ (బి) హెన్రిక్స్‌ 25, పడిక్కళ్‌ (సి) రాహుల్‌ (బి) హెన్రిక్స్‌ 40, క్రిస్టియన్‌ (సి) ఖాన్‌ (బి) హెన్రిక్స్‌ 0, మ్యాక్స్‌వెల్‌ (సి) ఖాన్‌ (బి) షమి 57, డివిల్లీర్స్‌ (రనౌట్‌/ఖాన్‌) 23, షాబాజ్‌ (బి) షమి 8, భరత్‌ (నాటౌట్‌) 0, గార్టన్‌ (బి) షమి 0, హర్షల్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 164/7; వికెట్లపతనం: 1/68, 2/68, 3/73, 4/146, 5/157, 6/163, 7/163, బౌలింగ్‌: మార్‌క్రమ్‌ 1-0-5-0, షమి 4-0-39-3, అర్ష్‌దీప్‌ 3-0-42-0, బిష్ణోయ్‌ 4-0-35-0, హర్‌ప్రీత్‌ 4-0-26-0, హెన్రిక్స్‌ 4-0-12-3

పంజాబ్‌: రాహుల్‌ (సి) పటేల్‌ (బి) షాబాజ్‌ 39, మయాంక్‌ (సి) సిరాజ్‌ (బి) చాహల్‌ 57, పూరన్‌ (సి) పడిక్కళ్‌ (బి) చాహల్‌ 3, మార్‌క్రమ్‌ (సి) క్రిస్టియన్‌ (బి) గార్టన్‌ 20, సర్ఫ్‌రాజ్‌ (బి) చాహల్‌ 0, షారుక్‌ (రనౌట్‌/పటేల్‌) 6, హెన్రిక్స్‌ (నాటౌట్‌) 12, హర్‌ప్రీత్‌ (నాటౌట్‌) 3, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 158/6; వికెట్లపతనం: 1/91, 2/99, 3/114, 4/121, 5/127, 6/146, బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-33-0, గార్టన్‌ 4-0-27-1, షాబాజ్‌ 3-0-29-1, హర్షల్‌ 4-0-27-0, చాహల్‌ 4-0-29-3, క్రిస్టియన్‌ 1-0-11-0.