Daniel Sams (Photo Credits: @DelhiCapitals/Twitter)

మరో రెండు రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టులో కీలక ఆటగాడు ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్‌కు (Daniel Sams Covid) బుధవారం కరోనా సోకింది. ఆస్ట్రేలియాకు చెందిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఆల్ రౌండర్ (Australian all-rounder) డేనియల్ సామ్స్‌కు కరోనా సోకడం ఆ టీంలో కలకలం రేపింది. గతంలో రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఒపెనర్ దేవదూత్ పడిక్కల్ కూడా కరోనా పాజిటివ్ బారిన పడ్డారు.

ఆర్సీబీ (Royal Challengers Bangalore) జట్టు ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్ తన జట్టుతో కలిసి చెన్నైలోని హోటల్ కు వచ్చినపుడు పరీక్షించగా కరోనా నెగిటివ్ అని వచ్చింది. రెండోసారి జరిపిన పరీక్షల్లో డేనియల్ కు పాజిటివ్ వచ్చింది. ఏప్రిల్ 3వతేదీన జరిపిన పరీక్షల్లో డేనియల్ కు నెగిటివ్ రాగా, బుధవారం జరిపిన రెండో పరీక్షల్లో పాజిటివ్ అని రావడంతో అతన్ని ఐసోలేషన్ కు తరలించారు.డేనియల్ కు అసింప్టమాటిక్ కరోనా అని బెంగళూరు వైద్య బృందం అతనికి కరోనా చికిత్స అందిస్తుందని రాయల్ ఛాలెంజర్స్ జట్టు తెలిపింది.

ఐపీఎల్ 2021ని వణికిస్తున్న కరోనా, వాంఖడే స్టేడియంలో 8 మందికి కోవిడ్, నితీష్‌ రాణా, అక్షర్‌ పటేల్‌, సీఎస్‌కే సిబ్బందిలో ఒకరికి కరోనా, సందిగ్ధంలో ఏప్రిల్‌10 తేదీ ఢిల్లీ క్యాపిటల్స్‌, సీఎస్‌కే మధ్య మ్యాచ్

బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం డేనియల్ ను 10రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంచుతామని జట్టు పేర్కొంది. కరోనా సోకిన డేనియల్ సామ్స్ 10రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడంతోపాటు వ్యాయామానికి దూరంగా ఉంటారని జట్టు తెలిపింది.