టీ20 ప్రపంచకప్-2022లో తొలి సెంచరీ నమోదైంది. సూపర్-12లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో (T20 World Cup 2022) సౌతాఫ్రికా బ్యాటర్ రిలీ రోసో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి సెంచరీ (Rilee Rossouw smashes first century) సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. తద్వారా టీ20 వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్‌లో తొలి శతకం నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
రోసోకు అంతర్జాతీయ టీ20లలో ఇది వరుసగా రెండో సెంచరీ. భారత పర్యటనలో భాగంగా అక్టోబరులో టీమిండియాతో జరిగిన ఆఖరి టీ20లో అతడు 48 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు ఐసీసీ టోర్నీలో బరిలోకి దిగి మరోసారి శతకం బాదాడు.సిడ్నీ వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రోసో.. టీ20 ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా శతకం బాదిన మూడో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ రికార్డుతో పాటు మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు రోసో. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు.
టీ20 ప్రపంచకప్ టోర్నీలో వేగంగా సెంచరీ సాధించిన క్రికెటర్లు
1. క్రిస్‌గేల్- 47 బంతుల్లో- 2016-
2. క్రిస్‌గేల్- 50 బంతుల్లో- 2007
3. బ్రెండన్ మెకల్లమ్- 51 బంతుల్లో- 2012
4. రిలీ రోసో- 52 బంతుల్లో-2022
అత్యధిక వ్యక్తిగత స్కోరు అరుదైన ఘనత
1. బ్రెండన్ మెకల్లమ్- 123 పరుగులు
2. క్రిస్‌గేల్- 117 పరుగులు
3. అలెక్స్ హేల్స్- 116 నాటౌట్
4. అహ్మద్ షెహజాద్- 111 నాటౌట్
5. రిలీ రోసో- 109 పరుగులు