Sachin Tendulkar (Photo Credits: PTI)

ఇటీవలే రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెట‌ర్ సచిన్‌ టెండూల్కర్‌కు కరోనా (Sachin COVID-19 Positive) సోకింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆయ‌న ట్వీట్ చేశారు. కొవిడ్ టెస్టు చేయించుకోగా త‌న‌కు స్వల్ప లక్షణాలతో పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, త‌న‌ కుటుంబంలోని మిగిలిన వారికి క‌రోనా నెగటివ్ గా నిర్ధార‌ణ అయింద‌ని ఆయ‌న తెలిపారు.

తాను ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నాన‌ని, వైద్యుల సూచ‌న‌లు తీసుకుంటున్నాన‌ని చెప్పారు. క‌రోనా సోకిన నేప‌థ్యంలో (Sachin Tendulkar Tests Positive for COVID-19) త‌న‌కు అండగా నిలిచిన ఆరోగ్య సిబ్బంది అందరికీ థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. కాగా, రోడ్‌ సేప్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో సచిన్‌ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్‌ ఫైనల్లో ఇటీవ‌ల‌ శ్రీలంకపై గెలుపొందింది.

ఇక దేశ రాజధానిలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌ టోర్నీలో ( ISSF Shooting World Cup) కరోనా కలకలం రేపింది. ముగ్గురు షూటర్లకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మిగతా షూటర్లంతా హోటల్‌ గదుల్లో ఐసోలేషన్‌లో ఉన్నట్టు నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్ఏఐ) వర్గాలు శనివారం వెల్లడించాయి. వైరస్‌ బారినపడ్డ షూటర్లతో సన్నిహితంగా ఉన్న మరో ముగ్గురు క్రీడాకారులు సైతం పరీక్షలు చేయించుకున్నట్టు అధికారులు తెలిపారు.

Here's Masrer Tweet

వారి ఫలితాలు రావాల్సి ఉండగా.. ముందస్తుగా సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు టోర్నీ నిర్వహకులు పేర్కొన్నారు. కోవిడ్‌ బారిన పడ్డ ముగ్గురు షూటర్లలో ఇద్దరు భారతీయ క్రీడాకారులేనని సంబంధిత వర్గాల సమాచారం. ఈ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారుల్లో ఇప్పటికే నలుగురు వైరస్‌ బారినపడగా.. గురువారం మరో విదేశీ ఆటగాడికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా..బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్‌కు కరోనా, నన్ను కలిసిన వారు తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలని ట్వీట్, దేశంలో తాజాగా 62,258 మందికి కరోనా నిర్ధారణ

దేశంలో గ‌త 24 గంటల్లో 62,258 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 30,386 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,08,910కు (Covid in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 291 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,61,240 కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,12,95,023 మంది కోలుకున్నారు. 4,52,647 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 5,81,09,773 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,97,69,553 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,64,915 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.