Scotland Beat Bangladesh by 6 Runs (Photo-Twitter)

టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో బంగ్లాదేశ్‌కు షాక్‌ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ సంచలన విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి మూడు బంతుల్లో విజయానికి 18 పరుగులు అవసరం కాగా... బంగ్లా ప్లేయర్‌ మెహిదీ హసన్‌ వరుస షాట్లు బాది (సిక్సర్‌, ఫోర్‌) ఆశలు రేకెత్తించాడు. అయితే, ఆఖరి బంతికి స్కాట్లాండ్‌ ఆటగాడు సఫ్యాన్‌ షరీఫ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి.. ఒక పరుగు మాత్రమే ఇచ్చి తమ జట్టు గెలుపును ఖరారు చేశాడు.

తొలుత టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. మన్సే(29), క్రిస్‌ గ్రీవ్స్‌(45), మార్క్‌ వాట్‌(22) రాణించారు. క్రిస్‌ గ్రీవ్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లు మెహిదీ హసన్‌కు 3, టస్కిన్‌ అహ్మద్‌కు ఒకటి, ముస్తాఫిజుర్‌కు 2, సైఫుద్దీన్‌కు 1, షకీబ్‌కు రెండు వికెట్లు దక్కాయి.

టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో 10 వికెట్ల తేడాతో ఒమన్‌ ఘన విజయం, మెగా ఈవెంట్‌కు తొలిసారి అర్హత సాధించిన పపువా న్యూగినియా ఓటమి

141 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా ఓవర్లన్నీ ఆడి 134/7 పరుగులు మాత్రమే చేసింది. షకీబల్‌ (20), ముష్ఫికర్‌ (38)ను వరుస ఓవర్లలో అవుట్‌ చేసిన గ్రీవ్స్‌ కోలుకోలేని దెబ్బకొట్టాడు. బ్రాడ్‌ వీల్‌ (3/24) మూడు వికెట్లు పడగొట్టాడు. టాస్‌ కోల్పోయి బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 140/9 స్కోరు చేసింది. ఓపెనర్‌ జార్జ్‌ మున్సే (29), మాథ్యూ క్రాస్‌ (11) రెండో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. బెర్రింగ్టన్‌ (2), మైకేల్‌ లీస్క్‌ (0)ను షకీబల్‌ ఒకే ఓవర్‌లో వెనక్కిపంపాడు. 8 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయి 53/6తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో గ్రీవ్స్‌, వాట్‌ (22) 7వ వికెట్‌కు 51 పరుగులు చేశారు.

స్కోర్లు: స్కాట్లాండ్‌- 140/9 (20)

బంగ్లాదేశ్‌- 134/7 (20)