దిగ్గజ ఆస్ట్రేలియా లెజండరీ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ (Shane Warne) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కొడుకు జాసన్‌తో కలిసి రైడ్‌కు వెళ్లుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అతడి కాలికి గాయమైనట్లు సమాచారం. ఆస్ట్రేలియన్ మీడియా నివేదికల ప్రకారం.. షేన్ వార్న్ మెల్‌బోర్న్‌లో రైడ్‌కు తన కూమారుడితో వెళ్తుండగా ఈ ప్రమాదం ( Injures Himself in Motorbike Accident) జరిగింది. అయితే స్పోర్ట్స్ బైక్‌ను అతివేగంగా నడిపినందునే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇక ఈ ప్రమాదంపై స్పందించిన షేన్ వార్న్ మాట్లాడూతూ.. "నేను అదుపు తప్పి బైక్‌పై నుంచి కిందపడిపోయాను. ఆసమయంలోనేనే కాస్త బయపడ్డాను. స్పల్పగాయాలతో బయటపడ్డాను. అప్పుడు నేను బాగానే ఉన్నానని అనుకున్నాను. కానీ మరుసటి రోజుకి గాయం తీవ్రమైంది.
తొలి టెస్టులోనే శ్రేయాస్ అయ్యర్ సూపర్ సెంచరీ, అరుదైన ఘనత సాధించిన యంగ్ బ్యాట్స్ మెన్
దీంతో పూర్తిగా నడవలేకపోయాను. తర్వాత ఆసుపత్రికి వెళ్లగా నా కాలికి గాయమైందని వైద్యలు తెలిపారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా గబ్బాలో జరిగే తొలి టెస్ట్‌కు నేను అక్కడే ఉంటాను" అని వార్న్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా తరపున 145 టెస్టులు ఆడిన షేన్ వార్న్ 708 వికెట్లు సాధించాడు.