Karachi, April 22: క్రికెట్ మీద అవగాహన ఉన్నవారికి బ్రెట్ లీ, షోయబ్ అక్తర్ (Shoaib Akhtar and Brett Lee)పేర్లను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారి వారి జనరేషన్లలో ఇద్దరూ నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్‌మెన్లను హడలెత్తించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే ప్రత్యేకత వీరికి మాత్రమే ఉండేది. అయితే బ్యాటింగ్ విషయం వచ్చేసరికి ఇద్దరికీ వణుకుపుట్టేది. ఈ విషయాలను పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చారు. కరోనావైరస్ ఔట్ స్వింగర్.. ఐపీఎల్ 2020 క్లీన్ బౌల్డ్. టోర్నమెంట్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ
బ్రెట్‌లీ పాల్గొన్న ఇండియన్ టెలివిజన్ షో వీడియో ఒకటి తన ట్విటర్‌లో షేర్ చేస్తూ తన అనుభవాలను పంచుకున్నారు.బౌలింగ్ లో నిప్పులు చెరిగే బ్రెట్‌లీ (Australia pacer Brett Lee) బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం ప్రతీ బౌలర్‌కు (Pakistan pacer Shoaib Akhtar) భయపడేవాడని అక్తర్ పేర్కొన్నాడు. కాగా బ్రెట్ లీ ఆ వీడియోలో షోయబ్ అక్తర్ బౌలింగ్‌ను ఏ విధంగా ఎదుర్కొన్నాడనేది చెప్పుకొచ్చాడు.
Here's Video
Binga being very humble there honestly. @BrettLee_58 himself was quite a terror on the field for the batsmen of that era. #BrettLee #ExpressFast #Australia pic.twitter.com/pzHTg41qMF
— Shoaib Akhtar (@shoaib100mph) April 20, 2020
'నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ప్రతీ ఒక్క బౌలర్‌కు భయపడేవాడిని.. ముఖ్యంగా స్పిన్నర్లకు కూడా. ఇక షోయబ్ అక్తర్ బౌలింగ్‌కు కూడా భయపడేవాడిని. నా ముద్దు పేరు బింగా.. ఒకసారి నేను బ్యాటింగ్ చేస్తుంటే బింగా.. బింగా.. అంటూ అరుస్తున్న శబ్ధం వినపడింది. తల ఎత్తి చూస్తే 75 మీటరల్ దూరంలో అక్తర్ ఉన్నాడు. అతని తీరు చూస్తే నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నా అన్నట్లుగా కనపడింది. షోయబ్ నా తలను టార్గెట్ చేసి బౌలింగ్ వేస్తాడేమో అనుకున్నా.. కానీ ఆ బాల్ నా టోస్‌ను తాక్కుంటూ వెళ్లింది. అంతే నేను అది ఔటేమోనని భావించి అంపైర్ వైపు చూశా.. అది కచ్చితంగా ఔటేనని.. కానీ మా ఆస్ట్రేలియన్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడని' బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు.
అయితే ఈ ఒక్క వీడియో చాలు.. బ్రెట్ లీ తన మాటల పట్ల ఎంత నిజాయితీగా ఉంటాడో చెప్పడానికి అంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మా జనరేషన్‌లో బ్రెట్‌లీ ఒక బ్యాట్స్‌మెన్‌గా ఎంత భయపడ్డాడనేది స్పష్టంగా కనిపిస్తుందంటూ అక్తర్ పేర్కొన్నాడు.
ఆసీస్ తరపున 76 టెస్టుల్లో 310 వికెట్లు, 221 వన్డేల్లో 380 వికెట్లు తీశాడు. ఇక షోయబ్ అక్తర్ పాక్ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు పడగొట్టాడు.