Kolakata, July 17: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్వీయ నిర్బంధంలోకి (Ganguly In Home Quarantine) వెళ్లాడు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శి, గంగూలీకి సోదరుడైన స్నేహాశీష్ గంగూలీ (Snehasish Ganguly) బుధవారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో దాదా కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం కానున్నాడు. బెంగాల్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన స్నేహాశీష్ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు క్యాబ్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా తెలిపారు. ఆసియా కప్ 2021కి వాయిదా, వచ్చే ఏడాది శ్రీలంకలో నిర్వహించే అవకాశం
అతనికి పాజిటివ్ రావడంతో నిబంధనల ప్రకారం గంగూలీ(BCCI President Sourav Ganguly) కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉండనున్నాడు. హెల్త్ ప్రొటోకాల్స్ ప్రకారం సౌరవ్ కూడా కొద్ది రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది’ అని ఆయన చెప్పారు. కాగా స్నేహాశీష్ గంగూలీ చికిత్సం కోసం ప్రస్తుతం బెల్లెవి ఆసుపత్రిలో చేరారు.స్నేహశీష్ పరిస్థితి మెరుగ్గా ఉన్నదని, అతడు త్వరలో కోలుకుంటాడని దాల్మియా ఆశాభావం వ్యక్తంజేశాడు.
కరోనా ప్రొటోకాల్ ప్రకారం సౌరవ్‌తో పాటు తాను కూడా హోం క్వారంటైన్‌కు వెళ్లనున్నట్టు అతడు తెలిపాడు. స్నేహాన్ష్‌తో కలిసి సౌరవ్ కూడా అదే ఇంట్లో నివశిస్తున్నారు. క్యాబ్ అసోసియేట్ జనరల్ సెక్రటరీ అయిన స్నేహాన్ష్‌తో కలిసి దాల్మియా గత వారం ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా కొంత కాలం క్వారంటైన్‌లో గడపనున్నట్లు తెలుస్తోంది. అయితే సౌరవ్, అవిషేక్‌కు కరోనా లక్షణాలు లేకపోవడంతో వారిద్దరికి తక్షణమే కొవిడ్-19 పరీక్షలు చేసే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది.