వచ్చే నెలలో టీమ్‌ఇండియాతో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం మంగళవారం దక్షిణాఫ్రికా16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ అనంతరం.. సఫారీ జట్టు ఆడనున్న తొలి టీ20 సిరీస్ ఇదే కాగా.. ఐదేండ్ల తర్వాత వేన్ పార్నెల్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో సఫారీ టీమ్‌కు టెంబా బవుమా సారథ్యం వహించనుండగా.. ట్రిస్టాన్ స్టబ్స్ తొలిసారి జట్టుకు ఎంపికయ్యాడు.
గాయం నుంచి కోలుకొని ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నోర్జేతో పాటు సీనియర్ ఆటగాళ్లు రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్‌కు చాన్స్ లభించింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య వచ్చే నెల 9న ఢిల్లీ వేదికగా తొలి టీ20 జరుగనుండగా.. ఆ తర్వాత వరుసగా కటక్ (జూన్ 12), విశాఖపట్నం (జూన్ 14), రాజ్‌కోట్ (జూన్ 17), బెంగళూరు (జూన్ 19)లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
దక్షిణాఫ్రికా జట్టు: బవుమా (కెప్టెన్), డికాక్, హెండ్రిక్స్, క్లాసెన్, కేశవ్, మార్క్మ్,్ర మిల్లర్, ఎంగ్డీ, నోర్జే, పార్నెల్, ప్రిటోరియస్, రబడ, షంసీ, స్టబ్స్, డసెన్, జాన్సెన్.