 
                                                                 South Wales, NOV 07: టీ20 ప్రపంచ కప్ లో ఆడేందుకు వెళ్లిన శ్రీలంక బ్యాట్స్‌మన్ దనుష్క గుణతిలకాను (Danushka Gunathilaka ) అత్యాచార ఆరోపణలపై ఆస్ట్రేలియా పోలీసులు (New South Wales Police) గత అర్ధరాత్రి దాటాక అరెస్టు చేశారు. నిన్న ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక ఓడిపోయిన విషయం తెలిసిందే. సిడ్నీలో శ్రీలంక ఆటగాళ్లు ఉంటున్న హోటల్ కు ఇవాళ తెల్లవారుజామున వెళ్లిన పోలీసులు దనుష్కా గుణతిలకాను అరెస్టు (Danushka Gunathilaka arrested) చేసి తీసుకెళ్లారు. దనుష్క గుణతిలకాపై 29 ఏళ్ల ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. కొన్ని రోజుల క్రితం తనపై దనుష్క గుణతిలకా రోజ్ రోజ్ బేలోని ఓ చోట లైంగిక దాడి (sexual assault ) చేశాడని ఆ మహిళ ఫిర్యాదు చేసిందని చెప్పారు.
ఓ ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా కొంత కాలంగా ఆ మహిళ-దనుష్కా గుణతిలకా చాటింగ్ చేసుకున్నారని పోలీసులు వివరించారు. ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడడానికి వచ్చిన దనుష్క గుణతిలకా నవంబరు 2న సాయంత్రం సమయంలో ఆ మహిళను రోజ్ రోజ్ బేలోని ఓ చోట కలిశాడని తెలిపారు. దీనిపై విచారణ ప్రారంభించామని చెప్పారు. ప్రాథమిక విచారణ తర్వాత ససెక్స్ స్ట్రీట్ లోని ఓ హోటల్ లో దనుష్క గుణతిలకాను అరెస్టు చేశామని వివరించారు.
అనంతరం అతడిని సిడ్నీ సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించామని అన్నారు. అనుమతి లేకుండా లైంగిక చర్యలో పాల్గొన్న ఆరోపణలపై అతడిపై కేసు నమోదు చేశామని చెప్పారు. కాగా, గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్ మ్యాచుల్లో దనుష్క గుణతిలకా ఆడడం లేదు. అయినప్పటికీ జట్టుతో కలిసి ఆస్ట్రేలియాలో ఉన్నాడు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
