 
                                                                 టీ20 వరల్డ్‌కప్-2022 గ్రూప్-2లో భాగంగా నవంబర్ 2న టీమిండియా-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం ఈ ఇరు జట్లు 3 మ్యాచ్‌లు ఆడి రెండేసి విజయాలతో 4 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో సమంగా నిలిచాయి. సెమీస్‌కు రేసులో నిలవాలంటే రేపు అడిలైడ్ వేదికగా జరిగే మ్యాచ్ (T20 World Cup 2022) ఇరు జట్లకు కీలకం కానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానుంది.
అయితే టీమిండియాతో కీలక సమరానికి ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (Bangladesh Captain Shakib Al Hasan) కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.నవంబర్ 1న జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్‌మీట్ సందర్భంగా షకీబ్ మాట్లాడుతూ.. తాము ఆస్ట్రేలియాకు వచ్చింది వరల్డ్‌కప్ గెలిచేందుకు కాదని.. టీమిండియాను ఓడించేందుకు తాము ఇక్కడికి వచ్చామని సంచలన వ్యాఖ్యలు చేశాడు. రేపటి మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తే అదే తమకు వరల్డ్‌కప్‌తో సమానమని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
రెండు జట్లు తమ కంటే బలమైన జట్లే అయినప్పటికీ, తమను తక్కువ అంచనా వేస్తే మాత్రం ఫలితం అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించాడు. టీమిండియా ఇక్కడికి వరల్డ్‌కప్ గెలిచేందుకు వచ్చింది, అలాంటి జట్టును ఓడిస్తే అదే తమకు పదివేలని, ఇందు కోసం తాము సర్వ శక్తులు ఒడ్డుతామని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా షకీబ్ సూర్యకుమార్ యాదవ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, అతనో వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని, అతన్ని కంట్రోల్ చేయగలిగితే తమ పని సులువవుతుందని అభిప్రాయపడ్డాడు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
